తెలంగాణలో రేపటి నుంచే కరోనా బూస్టర్ డోస్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో 60 ఏళ్లు పైబడిన వారికి తొలుత బూస్టర్ డోసు వేయనున్నట్టు వెల్లడించింది. రాష్ట్రంలో ఈ వయసువారి సంఖ్య 8.3లక్షలు ఉన్నట్టు తెలిపింది. సీనియర్ సిటిజన్ లు ఈ వ్యాక్సినేషన్ కు సహకరించాలని విజ్ఞప్తి చేసింది.

రెండు డోసుల టీకా తీసుకున్నవారు 6నెలల తర్వాత కొవాగ్జిన్ బూస్టర్ డోస్ తీసుకుంటే కొవిడ్ నుంచి మెరుగైన రక్షణ పొందవచ్చని భారత్ బయోటెక్ తెలిపింది. క్లినికల్ ట్రయల్స్ లో ఈ ఫలితం వెల్లడైందనీ.. సైడ్ ఎఫెక్ట్స్ కూడా కనిపించలేదని స్పష్టం చేసింది. బూస్టర్ డోసు తీసుకున్న 90శాతం మందిలో కరోనా వైరస్ ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లను నివారించే యాంటీ బాడీలు వృద్ధి చెందినట్టు భారత్ బయోటెక్ తెలింది.

కొవాగ్జిన్ బూస్టర్ డోసు తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తున్నాయని భారత్ బయోటెక్ తెలిపింది. రెండు డోసులు తీసుకున్న వారిలో పోలిస్తే.. మూడో డోసు తీసుకున్న వారిలో డెల్టా వేరియంట్ ను అడ్డుకునే యాంటీబాడీల వృద్ధి 5రెట్లు ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. బూస్టర్ డోస్ తీసుకున్న వారిలో టి, బిసెల్ రెస్పాన్స్ గుర్తించామని.. ఎక్కువ కాలం పాటు కరోనా నుంచి రక్షణ పొందవచ్చని వివరించింది.

మరోవైపు కోవిడ్ వ్యాక్సిన్ 11డోసులు తీసుకున్నట్టు ప్రకటించిన బీహార్ లోని 84ఏళ్ల బ్రహ్మదేవ్ మండల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. తాను గతేడాది ఫిబ్రవరి 13న తొలిడోసు వేయించుకున్నాననీ.. డిసెంబర్ వరకు 11సార్లు తీసుకున్నానని ఆ వృద్ధులు ప్రకటించాడు. అయినప్పటికీ తన ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది రాలేదని చెప్పాడు. ఈ విషయంలో నిజానిజాలు తేల్చేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు.

ఇక మన దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా లక్షా 59వేల 632 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 18వేల కేసులు ఎక్కువగా వచ్చాయి. పాజిటివీ రేటు రికార్డు స్థాయిలో 10.21శాతంగా నమోదైంది. దేశంలోని యాక్టివ్ కేసుల సంఖ్య 5లక్షల 90వేలు దాటింది. ఇఖ 24గంటల్లో కరోనా మహమ్మారితో మరో 327మంది మరణించారు. 40వేల 863మంది కోలుకున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: