ఒకప్పుడు ఎంత చిన్న ఆయుధం కావాలి అయినా సరే ఇతర దేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తోంది. దీనికోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన భారత ప్రభుత్వం ఇప్పుడు మాత్రం తమ పంథా మార్చుకుంది. చైనా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మేకిన్ ఇండియా అనే నినాదాన్ని తెరమీదకు తీసుకు వచ్చింది. కేవలం మేకున్ ఇండియా అంటూ పిలుపునివ్వడమే కాదు ఆ దిశగా అన్ని విధాలుగా అడుగులు వేస్తోంది.  విదేశాల నుండి ఆయుధాల కొనుగోలు చేయడం కాదు స్వదేశీ ఆయుధాలను తయారు చేయడమే లక్ష్యంగా ప్రస్తుతం భారత ప్రభుత్వం ముందుకు సాగుతోంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత రక్షణ పరిశోధన సంస్థ  శాస్త్రవేత్తలకు పూర్తిస్థాయి ప్రోత్సాహకం అందిస్తూ అటు బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయిస్తోంది భారతదేశం.



 అదే సమయంలో ఇక ఇతర దేశాలకు సంబంధించిన ఆయుధ తయారీ కంపెనీలను కూడా భారత్లోకి ఆహ్వానిస్తూ ఇక్కడ సంస్థలు స్థాపించె విధంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే భారత రక్షణ పరిశోధన సంస్థ దాదాపు పదికి పైగా క్షిపణి వ్యవస్థను తయారు చేసి అద్భుతమే సృష్టించింది. ఇక భారత శాస్త్రవేత్తలు తయారు చేసిన బ్రహ్మోస్ క్షిపణి కొనుగోలు చేయడానికి ఇటీవలే వియత్నాం ఫిలిఫైన్స్ లాంటి దేశాలు కూడా ముందుకు వస్తూ ఉండడం గమనార్హం.. అదే సమయంలో రష్యాతో కలిసి  భారత్ లో ఒక ఏకే 203 తయారీకి శ్రీకారం చుట్టింది. ఇక మరోవైపు ఫ్రాన్స్ తో కూడా కలిసి సబ్ మేరైన్ వ్యవస్థను మరింత అభివృద్ధి చేస్తుంది భారత్.



 అదే సమయంలో అద్భుతమైన టెక్నాలజీ కేరాఫ్ అడ్రస్ అయిన ఇజ్రాయిల్ తో కలిసి భారత్ అద్భుతమైన డిఫెన్స్ సిస్టమ్ను అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. బరాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టం తయారు చేసింది. ఇక ఈ డిఫెన్స్ సిస్టం ని మొరాకో దేశం కొనుగోలు చేయడానికి ముందుకు రావడం గమనార్హం. ఇప్పటికే  రెండు దేశాలు అటు భారత్ తయా రుచేసిన బ్రహ్మోస్ క్షిపణి కొనుగోలు చేసేందుకు ముందుకు రాగా ఇక ఇప్పుడు కూడా బరాక్ కొనుగోలు చేసేందుకు ముందుకు రావడంతో   భారత ఆయుధ విక్రయాలు మరింత పుంజుకున్నాయి అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: