మొన్నటివరకు తామే గొప్ప తమ కంటే గొప్ప వారు ఎవరూ లేరు అంటూ నమ్మిన సౌదీ అరేబియా ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇక రానున్న రోజుల్లో తమకు భవిష్యత్తు లేదు అన్నది అర్థం చేసుకుంటుంది.. మొన్నటివరకు ఆయిల్ బావులతో ముడి చమురు అన్ని దేశాలకు ఎగుమతి చేస్తూ లక్షల కోట్లు సంపాదించిన సౌదీ అరేబియా రానున్న రోజుల్లో మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలు శకం నడుస్తుంది అని   అర్థం చేసుకుని ఇక ఇప్పుడూ మార్పు దిశగా అడుగులు వేస్తుంది. ఈ క్రమంలోనే మొన్నటివరకు ఇస్లామిక్ చట్టాలను అమలు చేస్తూ ప్రజలందరికీ తీవ్రస్థాయిలో ఆంక్షలు విధిస్తూ వచ్చింది సౌదీ అరేబియా. కానీ ఇప్పుడు రానున్న రోజుల్లో పూర్తి స్థాయి ఎలక్ట్రికల్ వాహనాలు తీసుకొస్తామని ప్రపంచ దేశాలు చెబుతున్న నేపథ్యంలో ముడి చమురు మీద ఆధారపడకుండా ప్రత్యామ్నాయ   ఆదాయాల పై సాధించటమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.




 ఈ క్రమంలోనే ఇక ప్రత్యామ్నాయ ఆదాయాలను సృష్టించడమే లక్ష్యంగా తమ దేశంలో మొన్నటి వరకు అమలులో ఉన్న కఠిన ఆంక్షలు అన్నిటిలో మార్పు తీస్తున్నట్లు తెలుస్తోంది. మహిళలందరికీ సముచిత గౌరవం కల్పిస్తూ ఇప్పటికే ఎన్నో షాపింగ్ నిర్ణయాలు తీసుకుంది సౌదీ అరేబియా. తమ చట్టాలలో పూర్తిగా మార్పులు తీసుకు వస్తూ ఉండడం గమనార్హం. సౌదీ అరేబియాను ఒక పర్యాటక ప్రాంతంగా మార్చాలని నిర్ణయించుకుంది. అంతే కాకుండా ఇతర దేశాల నుంచి పెట్టుబడులు ఆహ్వానించి కంపెనీలు స్థాపించడం లక్ష్యంగా ముందుకు సాగుతోంది.



 ఈ క్రమంలోనే అటు దౌత్య పరంగా కూడా సౌదీ అరేబియా ఎంతో వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తోంది అన్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవల సౌదీ అరేబియా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇరాన్ ఇస్లామిక్ దేశం అయినప్పటికీ దానిని సౌదీ అరేబియాకు కొన్ని దశాబ్దాల నుంచి శత్రుదేశం గానే కొనసాగుతూ వస్తోంది..ఇక ఇరు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందాలు కానీ సంబంధాలు కానీ లేవు. కానీ ఇరాన్ తో మెరుగైన సంబంధాలను ఏర్పరచుకునేందుకు సౌదీఅరేబియా సిద్ధమైంది. ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇరు దేశాలు కలిసి ఒకరికి ఒకరు సహకారం అందించు కోవాలని ఇటీవల కీలక ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: