ఇక టీడీపీ పని అయిపోయింది...ఇంకా పార్టీకి భవిష్యత్ లేదు...మళ్ళీ ఆ పార్టీ అధికారంలోకి రాదని అధికార వైసీపీ నేతలు ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కొడాలి నాని లాంటి వారైతే...టీడీపీ పని ఖతం అయిపోయిందని, మళ్ళీ ఆ పార్టీ గెలవదని, ఇంకో 30 ఏళ్ళు జగనే సీఎంగా ఉంటారని అంటున్నారు. సరే ఈ మాటలు కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్‌గా ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్తితులని చూస్తే వైసీపీ బలంగానే ఉంది...అలా అని గత ఎన్నికల్లో ఉన్నంత బలంగా మాత్రం లేదు. అలాగే టీడీపీ కూడా పుంజుకుంది. కాకపోతే వైసీపీని డామినేట్ చేసే స్థాయికి రాలేదు.

ఇది ఏపీలో వైసీపీ-టీడీపీల పరిస్తితి...రాజకీయంగా ఎవరెన్ని మాట్లాడినా ఇదే పరిస్తితి ఉంది. కానీ రాజకీయంగా జనసేన సైతం కూడా టీడీపీపై విమర్శలు చేయడం మొదలుపెట్టింది. 2019 ఎన్నికల తర్వాత ఇంతవరకు రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం పెద్దగా జరగలేదు. కానీ తాజాగా పొత్తు విషయంలో చంద్రబాబు స్పందిస్తూ...వన్ సైడ్ లవ్ కరెక్ట్ కాదని, అటు వైపు ఉన్నవారు కూడా లవ్ చేయాలంటూ పరోక్షంగా పొత్తు గురించి మాట్లాడారు. అంటే చంద్రబాబు పొత్తుకు రెడీగా ఉన్న..పవన్ లేరని తెలుస్తోంది.


ఇక దీనిపై జనసేన నేతలు సీరియస్‌గానే స్పందిస్తున్నారు. టీడీపీ పార్టీ చచ్చిపోయిందని, ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదని కొందరు జనసేన నేతలు మాట్లాడుతున్నారు. అదే సమయంలో టీడీపీ శ్రేణులు జనసేనకు కౌంటర్లు ఇస్తున్నాయి. సరే జనసేనకు ఎంత సత్తా ఉందో అందరికీ తెలుసని, ఆ పార్టీతో పొత్తు లేకపోయినా తమకు పోయేదేమీ లేదని, కాకపోతే బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకెళుతున్న జనసేన వచ్చే ఎన్నికల్లో 10 సీట్లు గెలిస్తుందా? అని ప్రశ్నిస్తున్నారు. 10 సీట్లు గెలిస్తే గొప్పే అంటున్నారు. అయితే ఈ రచ్చ అంత కింది స్థాయిలో టీడీపీ-జనసేన కార్యకర్తల మధ్య జరుగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: