‘రాధే శ్యామ్’ వాయిదా పడటంతో ప్రభాస్ అభిమానులు మాత్రమే కాకుండా ప్రభాస్ కూడ షాక్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈసినిమా మొదలుపెట్టి మూడు సంవత్సరాలు దాటిపోవడంతో ప్రభాస్ సొంత వ్యక్తులు నిర్మిస్తున్న ఈమూవీ పై మరింత వడ్డీల ఖర్చు పెరిగిపోవచ్చు అంటూ ఊహాగానాలు వస్తున్నాయి. ఈపరిస్థితులు ఇలా ఉంటే ప్రభాస్ నటిస్తున్న ‘ఆదిపురుష్’ మూవీ కోసం వందలకోట్లు ప్రభాస్ వదులుకున్నాడు అంటూ ఒక బాలీవుడ్ మీడియా సంస్థ బయటపెట్టిన ఒక ఆసక్తికర కధనం ఇప్పుడు అభిమానులకు హాట్ టాపిక్ గా మారింది.




ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీలో నటిస్తున్న సమయంలో అతడికి అనేక ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీల నుండి యాడ్స్ లో నటించమని ఆఫర్లు వచ్చాయట. ఆ ఆఫర్లు ఒప్పుకుని ఉంటే అతడికి వందల కోట్లల్లో ఆదాయం వచ్చి ఉండేది. అయితే అప్పటి పరిస్థితులలో ‘ఆదిపురుష్’ మూవీకి బ్రేక్ పడితే ఆమూవీ నిర్మాతకు వందల కోట్లల్లో నష్టం వస్తుంది అన్న ఆలోచనలతో ఆ ఆదాయానికి ప్రభాస్ నో చెప్పాడట.  




సాధారణంగా టాప్ హీరోలు సినిమాలలో నటించడం కంటే యాడ్స్ లో నటించే విషయంలో ఏమాత్రం అవకాశం వచ్చినా వదులుకోరు. దీనికికారణం ఒక టాప్ హీరో భారీ సినిమాలో నటించడానికి కనీసం ఒక సంవత్సరం కష్టపడవలసి వస్తే ఒక యాడ్  లో నటించడానికి ఒక వారంరోజులు సరిపోతుంది. దీనికితోడు సినిమా ఫలితంలా హిట్ ఫ్లాప్ అన్న టెన్షన్ హీరోలకు ఉండదు. అందువల్లనే మల్టీ నేషనల్ కంపెనీల యాడ్స్ లో నటించడానికి ఏమాత్రం అవకాశం వచ్చినా హీరోలు తమ సినిమాల షూటింగ్ లను కూడ పక్కనపెట్టి నటిస్తూ ఉంటారు.




అయితే ప్రభాస్ మాత్రం దీనికి భిన్నంగా ప్రవర్తించి తన యాడ్ సంపాదన కంటే ‘ఆదిపురుష్’ షూటింగ్ బ్రేక్ పడకుండా కొనసాగడం చాల ముఖ్యం అనుకున్నాడు. తెలుగు ప్రజలకు రాముడు అంటే నందమూరి తారకరామారావు గుర్తుకు వస్తాడు. అలాంటి ఉదాత్తమైన పాత్రను చేసే విషయంలో చాలామంది ప్రయత్నించినా పూర్తిగా రాణించలేదు. ఇప్పుడు పాన్ ఇండియా మూవీగా విడుదలవుతున్న ‘ఆదిపురుష్’ ను తెలుగు ప్రజలు ఏవిధంగా ఆదరిస్తారో చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: