ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ జ‌న‌సేన పొత్తు పెట్టుకుంటాయ‌న్న ఊహాగానాలు వ‌స్తున్నాయి. మ‌రో వైపు రెండు పార్టీల‌కు చెందిన కీల‌క నేత‌ల మ‌ధ్య చ‌ర్చ‌లు కూడా రెండు మూడు విడ‌త‌ల్లో జ‌రిగాయ‌ని అంటున్నారు. 2014 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ళ్యాన్ జ‌న‌సేన పార్టీ పెట్టినా కూడా ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా బీజేపీ - టీడీపీ కూట‌మికి స‌పోర్ట్ చేశాడు. ఆ ఎన్నిక‌ల్లో వైసీపీ గ‌ట్టి పోటీ ఇచ్చినా చివ‌ర‌కు టీడీపీ విజ‌యం సాధించింది.

ఇక గ‌త ఎన్నిక‌ల్లో ఈ మూడు పార్టీలు వేర్వేరుగా పోటీ చేయ‌డంతో వైసీపీ చేతిలో ఈ మూడు పార్టీలు చిత్తు చిత్తు అయ్యాయి. ఈ క్ర‌మంలోనే తెలుగుదేశం పార్టీ చ‌రిత్ర‌లోనే ఎప్పుడూ లేన‌ట్టుగా కేవ‌లం 23 సీట్ల తో స‌రి పెట్టుకుంది. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి ఈ రెండు పార్టీలు క‌ల‌వ‌క‌పోతే మ‌రోసారి వైసీపీ యే అధికారం లోకి వ‌స్తుంద‌ని రెండు పార్టీ ల నేత‌లు భావిస్తున్నారు.

ఇక పైకి టీడీపీ నేత‌లు రెండు పార్టీల మ‌ధ్య పొత్తు ఉండ‌ద‌ని చెపుతున్నా లోప ల మాత్రం పొత్తు విష‌యంలో రెండు పార్టీ ల మ‌ధ్య ఇప్ప‌టికే అంత‌ర్గ‌తంగా చ‌ర్చ‌లు కూడా న‌డుస్తున్నాయ‌ని తెలుస్తోంది. చంద్ర‌బాబు ప‌వ‌న్ పార్టీకి బంప‌ర్ ఆఫ‌రే ఇచ్చార‌ని అంటున్నారు. మొత్తం 13 జిల్లాల్లో జిల్లాకు నాలుగు చొప్పున 52 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పార‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది.

త‌మ‌కు బ‌లం లేని జిల్లాల్లో సీట్లు త‌గ్గించుకుని.. బ‌లం ఉన్న జిల్లాల్లో సీట్లు పెంచుకునే లా బాబు ప్లాన్ ఉంద‌ని అంటున్నారు. క‌డ‌ప జిల్లాలో జ‌న‌సేన కు కాస్త ఎక్కువ సీట్లు ఇవ్వ‌డం.. అలాగే ప‌వ‌న్ కు ప‌ట్టున్న తూర్పు గోదావ‌రి, వైజాగ్ జిల్లాలో కూడా జ‌న‌సేన కే ఎక్కువ సీట్లు వ‌స్తాయంటున్నారు. ఏదేమైనా రెండు పార్టీల మ‌ధ్య పొత్తు అయితే ఫిక్స్ అయిపోయింద‌న్న ప్ర‌చార‌మే ఇంట‌ర్న‌ల్ గా ఎక్కువుగా న‌డుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: