భారత ప్రధాన మంత్రి దామోదర్ దాస్ నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటనలో జరిగిన భద్రతా వైఫల్యం పై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ప్రధాన మంత్రి బఠిండా ఎయిర్ పోర్టు నుంచి బయలు దేరే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపామని ఎస్.జి పి పేర్కోంటోంది. ప్రధాని భద్రతా వైపల్యానికి  రాజకీయ రంగు పులుముతున్నారని పంజాబ్ ప్రభుత్వం  పేర్కోంటోంది. ఈ అంశం పై  భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఏమనిందో తెలుసా ?
ప్రధాన మంత్రి దామోదర్ దాస్ నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటనలో తలెత్తిన లోపం పై దాఖలైన పిటీషన్ ను సుప్రిం కోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ రమణ నేతృత్వం లోని ధర్మాసం ఈకేసు పై వాదనలు వినింది.
సొలిసిటరీ జనరల్ తుషార్ మోహతా కేంద్ర ప్రభుత్వ వాదనలు వినిపించారు. ప్రధాన మంత్రి పర్యటన ముందుగానే ఖరారైందని పేర్కోంటూ, వాతావరణ పరిస్థితుల కారణంగా  బఠిండా నుంచి రోడ్డు మార్గాన ప్రయాణించ వలసి వచ్చిందని తెలిపారు. ఈ విషయాన్ని తాము ముందుకుగా పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు, నిఘా ఏజెన్సీలకు  తెలిపామని మోహతా కోర్టుకు వివరించారు. పంజాబ్ అధికారులు మాత్రం రహదారి లో ఎలాంటి అడ్డుకులు లేవని పేర్కోంటూ , తమను తప్పుదారి పట్టించారని మెహతా ఆరోపించారు. పంజాబ్ ప్రభుత్వ వాదనలను ఆ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ డిఎస్ పట్వాలియా వివరించారు తాము రికార్డులను పంజాబ్ కోర్టు రిజిస్ట్రీలకు ఇప్పటికే అందజేశామని తెలిపారు. తమ తప్పేమీ లేదని పట్వాలియా తెలిపారు. తమను దోషులుగా కేంద్ర ప్రభుత్వ అధికారులు పేర్కోనడాన్ని తప్పు పట్టారు. రాజకీయ రంగు పులుముతున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇరు వాదనలు విన్న జస్టిస్ రమణ నేతృత్వం లోని ధర్మాసనం స్వతంత్ర  కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తామని ప్రకటించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి హాజరైన న్యాయవాదులు అంగీకారం తెలిపారు. విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తామని, ఈ కమిటీ ఎవరిది వైఫల్యం, ఎవరిది తప్పు అనే అంశంపై దర్యాప్తు చేస్తుందని న్యాయమూర్తులు తెలిపారు.  లా వాయిస్ అనే సంస్థ  ప్రధాని భద్రతా వైఫల్యం పై కోర్టులో కేసు దాఖలు చేసిన విషయం విదితమే.


మరింత సమాచారం తెలుసుకోండి: