రాజకీయాల్లో నాయకులు ఎప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉండకూడదనే చెప్పాలి...కాన్ఫిడెన్స్‌తో ఉంటే బాగానే ఉంటుంది గానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పటికైనా దెబ్బ వేస్తుంది. గతంలో టీడీపీ నేతలు బాగా ఓవర్ కాన్ఫిడెన్స్‌గా ఉండేవారు. అసలు టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం వారికి అడ్డే లేదన్నట్లు ఉండేవారు. ఇంకా అసలు తమకు తిరుగులేదని, మళ్ళీ చంద్రబాబు ఇంకో 15 ఏళ్ల పాటు సీఎంగా ఉంటారని చెప్పేవారు. అటు చంద్రబాబు కూడా అదే కాన్ఫిడెన్స్‌తో ఉండేవారు.

అయితే టీడీపీ నేతలది పూర్తిగా ఓవర్ కాన్ఫిడెన్స్ అని 2019 ఎన్నికల్లో రుజువైంది. ఒక దెబ్బకు టీడీపీ నేతలు పాతాళానికి పడ్డారు. సరే ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల నష్టపోయామనే విషయం టీడీపీ నేతలు మెల్ల మెల్లగా అర్ధం చేసుకుంటూ, మళ్ళీ పికప్ అవ్వడానికి చూస్తున్నారు. ఇక ఇప్పుడు టీడీపీ నేతలు కంటే మరీ ఎక్కువగా వైసీపీ నేతల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. వారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏ విధంగా రాజకీయం చేస్తున్నారో తెలిసిందే. అసలు మాకు ఇంకా తిరిగే లేదు అన్నట్లు ముందుకెళుతున్నారు.

ఇక పదే పదే జగన్ మరో 30 ఏళ్ల పాటు సీఎంగా ఉంటారని చెబుతున్నారు. కాన్ఫిడెన్స్‌తో ఉంటూ, తమ పాలన నచ్చితే జనమే మళ్ళీ గెలిపిస్తారని చెబితే బాగానే ఉంటుంది...కానీ వైసీపీ నేతల వర్షన్ అలా లేదు...ఇంకా తమకు ఎదురులేదని మాట్లాడుతున్నారు. పైగా చంద్రబాబు పని అయిపోయిందని, టీడీపీని ఇంకా మూసుకోవాల్సిందే అని మాట్లాడుతున్నారు.

స్థానిక ఎన్నికల్లో కుప్పంలో కూడా టీడీపీ దారుణంగా ఓడిపోవడంతో మరింత ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు. అసలు జీవిత కాలంలో చంద్రబాబు సీఎం అవ్వలేరని కొడాలి నాని అంటారు..ఇంకా రాజకీయాల్లో చంద్రబాబు పేరు కనిపించదని బొత్స సత్యనారాయణ అంటున్నారు. రాజీనామా చేసి కుప్పంలో మళ్ళీ గెలవాలని చెప్పి రోజా మాట్లాడుతున్నారు. అసలు మళ్ళీ రోజా నగరిలో గెలుస్తారో లేదో తెలియడం లేదు..కానీ ఆమె ఓవర్ కాన్ఫిడెన్స్‌తో బాబు ఓడిపోతారని అంటున్నారు. మరి ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పటికైనా వైసీపీని ముంచేలా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: