జ‌గ‌న్ అంత గొప్పగా రాజ‌ధానిపై ఎవ్వ‌రూ అబ‌ద్ధాలు ప్రచారం చేయ‌లేర‌ని త‌రుచూ టీడీపీ అంటుంటుంది.ఓవిధంగా ఇలాంటి మాట‌ల‌ను జ‌రుగుతున్న ప‌రిణామాలే నిరూపిస్తాయి.బ‌లోపేతం చేస్తాయి.క‌నుక సీఆర్డీఏ ఉన్నా లేక‌పోయినా జ‌గ‌న్ ఆ రోజు ఏదో ఒక‌టి చేసి త‌న పంతం నెగ్గించుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడి,స్థాయికి మించి ప‌నిచేసి ఆఖ‌రికి ఎటువంటి మంచి ఫ‌లిత‌మూ అందుకోలేక ఉన్న ప‌రువు కాస్త పోగొట్టుకున్నారు.జ‌గ‌న్ అణిచివేయాల‌నుకున్న రాజ‌ధాని ఉద్య‌మం అనూహ్య రీతిలో స‌క్సెస్ అయింది.ఆయ‌న వ‌ద్ద‌నుకున్న సీఆర్డీఏ మ‌ళ్లీ ఆయ‌నే పున‌రుద్ధ‌రించుకున్నారు.ఆయ‌న కావాల‌నుకున్న మూడు రాజ‌ధానుల బిల్లు కూడా ముల్లులా గుచ్చుతోంది ఇప్ప‌టికీ..!ఈ విధంగా వ‌ద్ద‌నుకున్న‌వి పోయేవి..కావాల‌నుకున్న‌వీ పోయేవి..ఇవ‌న్నీ జ‌గ‌న్ ఇమేజ్ గ్రాఫ్ ను అమాంతం ప‌డేశాయి.



అమ‌రావ‌తినే రాజ‌ధానిగా ఉంచాల‌ని మూడు ముక్క‌లాట వ‌ద్ద‌ని టీడీపీ అంటోంది.కానీ ప‌ట్టుద‌ల‌కు పోయి వైసీపీ ఆ మాట నెగ్గ‌కుండా చేస్తోంది.ఇవేవీ కాద‌ని బీజేపీ కూడా అమ‌రావ‌తికే మ‌ద్ద‌తు ఇచ్చి బాబు వైపు అండ‌గానే ఉంది.ఆ మాట‌కు వ‌స్తే వ‌చ్చే ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ వెళ్లినా వెళ్ల‌క‌పోయినా బాబు వైపు ఒకింత సానుకూలంగానే ఉంది.అప్పుల క‌థ వినిపిస్తూ,క‌రోనా సాకుతో జ‌గ‌న్ ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తూ పోతున్నార‌న్న కోపం కూడా బీజేపీకి ఉంది.అదే ఇప్పుడు బీజేపీ విష‌య‌మై చంద్ర‌బాబుకు సానుకూలం కానుంది. అమ‌రావ‌తి రాజ‌ధాని అనే విష‌యంపైనే పోరాటం చేస్తూ వ‌స్తున్నారు టీడీపీ నాయ‌కులు.ఓవిధంగా అదే క‌రెక్టు. విశాఖ రాజ‌ధాని అన్న‌ది  పెద్ద‌గా ప్రేమ లేని విష‌యం కూడా!

 ఎందుకంటే రాజ‌ధాని అనే పేరుతో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చంద్ర‌బాబు చేశార‌ని జ‌గ‌న్ చెప్పినా ఇప్పుడెవ్వ‌రూ న‌మ్మ‌రు.ఎందుకంటే అవే భూముల‌తో అప్పులు,అవే భూముల‌తో రియ‌ల్ ఎస్టేట్లు,ఇంకా చాలా చేయాల‌ని భావించి,చేయొచ్చ‌ని లేటెస్టుగా జ‌గ‌న్ తెలుసుకుని మూడు వేల కోట్ల‌కు రుణం తేవాల‌ని కూడా డిసైడ్ అయ్యారు.సో..ఓ వైపు అమ‌రావ‌తి అన్న‌ది ఎడారి అని నోటికి వ‌చ్చినదంతా మాట్లాడుతున్న వైసీపీ నాయ‌కులు ఎలా రియ‌ల్ బిజినెస్లు చేస్తారు.?

ఇదే స‌మ‌యంలో ఆర్ఆర్ఆర్(రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ కృష్ణం రాజు) సీన్ లోకి వ‌చ్చి త‌న ప‌దవికి రాజీనామా చేసి ఉప ఎన్నిక‌ల‌కు పోతానంటున్నారు.ఒక‌వేళ అది జ‌రిగినా కూడా జ‌గ‌న్-కు పెద్ద‌గా క‌లిసివ‌చ్చే విష‌యం అమ‌రావ‌తి కానే కాదు.ఆయ‌నే చెప్పారు సింగిల్ ఎజెండాతో ఎన్నిక‌లకు వెళ్తాన‌ని.అమ‌రావ‌తే రాష్ట్ర రాజ‌ధాని అని చెప్పి ప్ర‌జ‌ల ద‌గ్గర‌కు వెళ్లి ఓట్లు అడుగుతాన‌ని అంటున్నారు..ఆ మాట స‌క్సెస్ అయినా కాక‌పోయినా  ఒక సింగిల్ ఎజెండాతో ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డం ఒకందుకు మంచిదే!


మరింత సమాచారం తెలుసుకోండి: