రాజకీయంగా పార్టీలు మార్చడం, నియోజకవర్గాలు మార్చడం గంటా శ్రీనివాసరావుకు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పొచ్చు. అయినా పరిస్తితులకు అనుగుణంగా రాజకీయం మార్చేసి సక్సెస్ అవుతారు. ఇంతకాలం అలాగే సక్సెస్ అవుతూ వచ్చారు. అందుకే ఇప్పటివరకు ఓడిపోలేదు. అసలు గత ఎన్నికల్లో అంతటి జగన్ గాలిలో సైతం నియోజకవర్గం మార్చి సక్సెస్ అయ్యారు. ఎన్నికల ముందు వరకు భీమిలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

మరి ఏం అనుకున్నారో గానీ..భీమిలిలో పోటీ చేస్తే ఓడిపోతారని అర్ధమైనట్లు ఉంది...అందుకే సడన్‌గా రూట్ మార్చేశారు. టీడీపీ బలంగా ఉన్న విశాఖ నార్త్ సీటులో ప్రత్యక్షమయ్యారు. అయితే ఇక్కడ కూడా గంటా గెలుపు కష్టమయ్యేది....కానీ చివరి రౌండ్‌లో పైచేయి సాధించారు. మరొకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ నేత కే‌కే రాజు చివరి వరకు పొరాడి ఓడిపోయారు.

అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక గంటా రాజకీయం ఏ విధంగా మారిపోయిందో తెలిసిందే. ఆయన సడన్‌గా టీడీపీలో కనిపించడం మానేశారు. రాజకీయంగా ఏదైనా ఇబ్బంది వస్తుందని సైలెంట్ అయ్యారు. పైగా వైసీపీలోకి వెళ్లాలని చెప్పి గట్టిగానే ట్రై చేసినట్లు తెలిసింది. మరి వైసీపీలోకి రాకుండా విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాస్‌లు అడ్డుకున్నారని టాక్ వచ్చింది.

సరే ఏదేమైనా గానీ గంటా పార్టీ మారడం ఆగింది. సరే అని టీడీపీలో అంతగా యాక్టివ్ గా పనిచేయడం లేదు. దీని వల్ల విశాఖ నార్త్‌లో టీడీపీ వీక్ అయిపోయింది. అక్కడ సరైన నాయకత్వం లేక క్యాడర్ చెల్లాచెదురైంది. ఇదే వైసీపీ నేత కే‌కే రాజుకు మంచి అవకాశం వచ్చేలా చేసింది. ఆయన ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉంటూ వస్తున్నారు. దీని వల్ల కే‌కే రాజుకు మరింత పట్టు పెరిగింది. నెక్స్ట్ ఎన్నికల్లో కే‌కే రాజుకు గెలుపు అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మళ్ళీ గాని నార్త్‌లో గంటా పోటీ చేస్తే కే‌కే మీద ఓడిపోవడం ఖాయమని చెప్పొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: