ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నిర‌స‌న‌ల‌కు పిలుపునిస్తోంది టీడీపీ. ముఖ్యంగా ఏపీలో ప్ర‌భుత్వ వ్య‌తిరేక విధానాల‌పై పోరాటానికి సిద్ధం కావాల‌ని టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు క్యాడ‌ర్‌కు పిలుపునిచ్చారు. ముఖ్యంగా నిత్య‌వ‌స‌ర సరుకుల ధ‌ర‌ల త‌గ్గింపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు చేప‌ట్టాల‌ని టీడీపీ నిర్ణ‌యించింది. రేప‌టి నుంచి నిర‌స‌న‌లు కొన‌సాగించాల‌ని పార్టీ నేత‌ల‌కు సూచించారు. పార్టీ నేత‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించిన బాబు  ఏపీ ప్ర‌భుత్వం తీరుపై విరుచుకుప‌డ్డారు. ముఖ్యంగా రాష్ట్రలో పెరిగిన ధ‌ర‌లు దిగిరావాలి.. జ‌గ‌న్ దిగిపోవాలి అనే నినాదంతో నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని పార్టీ క్యాడ‌ర్‌కు సూచించారు.

ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌కు స‌మాధానం చెప్ప‌లేక వైసీపీ డిఫెన్స్‌లో ఉంద‌న్నారు చంద్ర‌బాబు. ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌తో గ్రామ‌స్థాయిలో వైసీపీ క్యాడ‌ర్‌, రాష్ట్ర స్థాయిలో వైసీపీ లీడ‌ర్లు కూడా ఇబ్బంది ప‌డుతున్నార‌ని, మైనింగ్ దోపిడీపై పూర్తిస్థాయి పోరాటానికి సిద్ధ‌మ‌వ్వాల‌ని క్యాడ‌ర్‌కు, నేత‌ల‌కు బాబు పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క‌నుస‌న్న‌ల్లో రాష్ట్రంలో మైనింగ్ దోపీడి కొన‌సాగుతోంద‌ని ఆరోపించారు. మైనింగ్‌, మ‌ద్యం, ఇసుక‌, ల్యాండ్ మాఫియా ద్వారా ఇప్ప‌టికే వేల కోట్ల దోపిడికి పాల్ప‌డ్డారు. చివ‌రికీ నాడు-నేడు కార్య‌క్ర‌మాల్లో కూడా అవినీతికి పాల్ప‌డ్డారు అని, పీఆర్‌సీని పునఃస‌మీక్షించాల‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు.  

అదేవిధంగా గ్రామ‌, వార్డు, స‌చివాల‌య రెగ్యుల‌ర్ చేయాల‌ని డిమాండ్ చేసారు. అలాగే వినుకొండ‌లో మ‌ద్ధ‌తు ధ‌ర అడిగిన రైతుపై అక్ర‌మ కేసులు పెట్ట‌డం దారుణ‌మ‌ని మండిప‌డ్డారు. పంచాయ‌తీల్లో సీఎం జ‌గ‌న్ విప‌రీతమైన ప‌న్నుల భారాన్ని మోపారు అని బాబు వెల్ల‌డించారు. ప్ర‌తి సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి 01న ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీకి క్యాలెండ‌ర్ విడుద‌ల చేస్తామ‌ని ఇచ్చిన హామీని నెర‌వేర్చాల‌ని డిమాండ్ చేసారు.

మ‌రొక‌వైపు టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై మంత్రి  మండిప‌డ్డారు. సీఎం జ‌గ‌న్ పాల‌న‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థ ప‌డుతున్నార‌ని, ఆయ‌న‌కు వస్తున్న ఆధ‌ర‌ణ చూడ‌లేక చంద్ర‌బాబు అసత్య ప్ర‌చారాలు చేస్తున్నార‌ని మంత్రి పెద్దిరెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబు అటెండ‌ర్‌ను కూడా నిల‌బెట్టి గెలిపించే స‌త్తా వైసీపీకి ఉంద‌ని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: