అవును ఇది నిజం. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో  పర్యావరణం నిత్యం మారుతోంది. వాయు కాలుష్యం పెరుగుతోంది. కనీస ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పడిపోతున్నాయి.  వాతావరణ పరిస్థితులు రోజు రోజుకు మారుతున్నాయి. ఇంకా చెప్పాలంటే గంట గంటకూ మారుతున్నట్లే. ఢిల్లీ వాసులు
ఇక నుంచి కూర్చోని తింటామంటే కుదరదు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరక నిర్ణయం తీసుకుంది. కారణం ఏమిటో తెలుసా మీకు ?
దేశ రాజధాని నగరం ఢిల్లీ లో కోవిడ్-19 నూతన వేరియంట్ ఓమిక్రాన్ ప్రభావం గంట గంటకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు అధికార వర్గాల సమాచారం. ఢిల్లీ విపత్తుల నిర్వహణ సంస్థ తాజాగా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ అనిల్, ముఖ్యమంత్రి అరవింద్ కెజ్రీవాల్ హాజరయ్యారు. కరోనా కట్టడికి  ఇప్పటి వరకూ తీసుకున్నచర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం చర్చించినట్లు తెలిసింది. ఢిల్లీలోని ప్రభుత్వ, ప్రైవైేటు కార్యాలయాలు ప్రస్తుతం యాభై శాతం సిబ్బంతితో పనిచేస్తున్నాయి. ఇక నుంచి వంద శాతం సిబ్బందికి వర్క్ ఫ్రం హోం పని చేసేలా అదేశాలు జారీ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. మరో వైపు ఢిల్లీ పోలీసులుపై కరోనా పడక వేసిన నేపథ్యంలో తీసుకున్నచర్యలపై సమావేశం చర్చించింది. దాదాపు వెయ్యి మంది పోలీసులు కరోనా బారిన పడటం పై సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతానికి లాక్ డౌన్ అమలు చేయాల్సిన అవసరం లేదని తదుపరి సమావేశంలో అప్పటి పరిస్థితి ని సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని సమావేశం అభిప్రాయపడింది. అన్నింటి కంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే. ఢిల్లీ లోని హోటళ్ల లో ఇక నుంచి డైనింగ్ సదుపాయాన్ని రద్దు చేశారు. కేవలం టెక్ అవే నే అనుమతించనున్నారు. ఎవరు కూడా హోటళ్ల లో కూర్చిని తినడం ఇకపై కుదరదన్నమాటే.  సమావేశపు తాజా నిర్ణయాలపై అధికారిక ప్రకటన వెలవడ నుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: