ప్ర‌భుత్వానికి సంబంధించిన ఏ అప్లికేష‌న్‌కు కానీ.. ఏ అవ‌స‌రంకు అయినా రేష‌న్ త‌ప్ప‌కుండా అవ‌స‌రం ఉండే విష‌యం అందరికీ తెలిసిందే. ఆధార్‌కార్డు, పాన్‌కార్డు మాదిరిగానే రేష‌న్‌కార్డు కూడా కీల‌క‌మైన గుర్తింపు డాక్యుమెంట్ రేష‌న్‌కార్డు క‌లిగి ఉండ‌డం వ‌ల్ల చాలా ర‌కాల లాభాలున్నాయి. అన్నింటిక‌న్నా ముఖ్యంగా ప్ర‌భుత్వం అందించే రేష‌న్ స‌రుకులు తీసుకోవ‌చ్చు. ఇత‌ర ప‌త్రాల మాదిరిగానే కార్డు కూడా చాలా ముఖ్య‌మైన ప‌త్రాల‌లో ఒక‌టి. రేష‌న్ పౌరుని రుజువుతో పాటు అడ్ర‌స్ ప్రూఫ్ గా కూడా ప‌ని చేస్తుంది.  


రేషన్ పొంద‌డానికి కార్డులో రేష‌న్ కార్డు హోల్డ‌ర్ల పేరు ఉండ‌టం చాలా ముఖ్యం. రేష‌న్ కార్డులో మీ పేరు ఉన్న‌దో లేదో మీరు ఇప్పుడు ఆన్‌లైన్ లో చెక్ చేసుకోవ‌చ్చు. దీనికోసం మీరు కేవ‌లం కింది సూచ‌న‌లు పాటిస్తే స‌రిపోతుంది.

రేషన్‌కార్డులో ఉన్న పేరును ఏ విధంగా చెక్ చేసుకోవాలి.

1. ముందుగా మీరు రేష‌న్‌కార్డులో పేరును త‌నిఖీ చేయ‌డానికి అధికారిక వెబ్‌సైట్ నేష‌న‌ల్ ఫుడ్ సెక్యూరిటీ పోర్ట‌ల్‌కు వెళ్లాలి. nfsa.gov.in లింక్‌పై క్లిక్ చేయ‌డం ద్వారా మీరు డైరెక్ట్ వెబ్‌సైట్‌కు వెళ్ల‌వ‌చ్చు.
 
2. వెబ్ సైట్ సంద‌ర్శించిన త‌రువాత మీరు ప్ర‌ధాన స్క్రీన్‌పై అనేక విభిన్న ఎంపిక‌ల‌ను చూస్తారు. అందులో టాప్ మెనూలో కార్డు ఆప్ష‌న్ ఎంచుకోవాలి. దీని త‌రువాత స్టేట్ పోర్ట‌ల్ లో రేష‌న్‌కార్డు వివ‌రాల ఎంపికపై క్లిక్ చేయండి.

3. మీరు అన్ని రాష్ట్రాల పేరును చూస్తారు. అందులో మీ రాష్ట్రం పేరును ఎంచుకుని దానిని ఎంచుకోవాలి. అన‌గా మీరు తెలంగాణ వారైతే తెలంగాణ‌ను ఎంచుకోండి.

4. రాష్ట్రం పేరును ఎంచుకున్న త‌రువాత మీ ముందు అన్ని జిల్లాల పేర్లున్నాయి. అందులో మీరు మీ జిల్లా పేరును క‌నుగొని దానిని ఎంచుకోవాలి.

5. మీ పేరును త‌నిఖీ చేయ‌డానికి మీరు పూర్తి వివ‌రాల‌ను పూరించాలి. అదే లింక్‌లో రాష్ట్రం, జిల్లా పేరును ఎంచుకున్న త‌రువాత ఇప్పుడు మీకు అర్బ‌న్ లేదా రూర‌ల్ బ్లాక్ పేరు క‌నిపిస్తుంది. మ‌రొక‌వైపు మీరు ప‌ట్ట‌ణ ప్రాంతంలోని రేష‌న్ కార్డులో మీ పేరును చూడాల‌నుకుంటే.. ఈ బ్లాక్‌ను ఎంచుకోండి. మీరు గ్రామీణ ప్రాంతానికి చెందిన వారు అయితే మీరు గ్రామీణ బ్లాక్ పేరును ఇక్క‌డ ఎంచుకోవ‌చ్చు.

6. దీని త‌రువాత మీ గ్రామ‌పంచాయ‌తీ పేరును ఎంచుకోవాలి. ఈ ఎంపిక గ్రామీణ బ్లాక్‌ల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉంటుంది.
 
7. అనేక ర‌కాల కార్డు ఎంపిక‌లు మీ ముందు ఉంటాయి. ముఖ్యంగా మీ పేరును త‌నిఖీ చేయాల‌నుకుంటున్న కార్డును ఎంచుకోవాల‌ని గుర్తుంచుకోండి.

8. చివ‌ర‌గా, మీరు రేష‌న్ కార్డు ర‌కంపై క్లిక్ చేసిన వెంట‌నే రేష‌న్ కార్డు హోల్డ‌ర్ల పూర్తి జాబితా మీ ముందు తెర‌వ‌బ‌డుతుంది. దీనిలో మీరు మీ పేరు లేదా కుటంబ స‌భ్యుల‌పేరును వెంట‌నే చెక్ చేసుకోవ‌చ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: