ఉద్యోగుల పీఆర్సీ అంశం నిన్న మొన్నటి వరకూ ఏపీలో హాట్ టాపిక్ అయ్యింది. ఉద్యోగులు కోరినంతగా ఫిట్‌మెంట్ పెంచకపోయినా.. ఉద్యోగ విరమణ గడువు రెండేళ్లు పెంచడం వల్ల ఉద్యోగులకు భారీగా లాభం కలుగుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఉద్యోగుల రిటైర్‌మెంట్‌ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచడం సాహసోపేతమైన నిర్ణయంగా కొందరు ఉద్యోగులు చెబుతున్నారు.


గతంలో తెలంగాణలో ఉద్యోగుల రిటైర్‌మెంట్ వయస్సును 60 నుంచి 61 సంవత్సరాలకు పెంచారు. ఇప్పుడు ఏపీలో అక్కడికన్నా మరో ఏడాది పెంచారు. దీని వల్ల వేలాది మంది ఉద్యోగులు లబ్ధి పొందబోతున్నారు. ఈ జగన్ నిర్ణయంతో ప్రతి ఉద్యోగికి అదనంగా 24 నెలల ఉద్యోగ సమయం కలసి వస్తుంది. దీంతో మధ్య స్థాయి ఉద్యోగికి రూ.30 నుంచి రూ.40 లక్షలకుపైగా లబ్ధి చేకూరుతుంది. రెండేళ్ల సర్వీసు పెరగుతుంది.. దీనివల్ల పెన్షన్‌ కూడా ఆదే స్థాయిలో పెరుగుతుంది కదా.


అంతే కాదు.. ఇప్పుడు జగన్ అడక్కపోయినా ఇళ్ల స్థలాల అంశంలోనూ సానుకూల నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఉద్యోగ సంఘాల డిమాండ్లలో ఈ స్థలం అంశం లేనే లేదు. ఉద్యోగులు దీని గురించి ప్రభుత్వాన్ని అడగలేదు. అయినా సరే ఉద్యోగులకు జగనన్న స్మార్ట్‌ టౌన్‌ షిప్స్‌లోని ఎంఐజీ లే అవుట్లలో కొంత కేటాయిస్తామన్నారు. పది శాతం స్థలాలు రిజర్వు చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు.


అంతే కాదు.. ఈ స్థలాల రేట్లు కూడా 20 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించారు. దీంతో ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇళ్ల స్థలాలపై గత టీడీపీ ప్రభుత్వం ఉద్యోగులను నమ్మించి మోసం చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. చంద్ర బాబు మాయ మాటలతో కాలక్షేపం చేశారని.. రాజధానిలోనూ ఉద్యోగులకు ఇళ్లు ఇస్తానని నమ్మించారని అంటున్నారు. వైఎస్‌ జగన్‌ మాత్రం అడక్కుండానే ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇస్తానని ప్రకటించారని కొందరు ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: