పార్టీల మధ్య పోలీసులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది.  బండి సంజయ్ ఎపిసోడ్ తర్వాత జరుగుతున్న చర్చ ఇదేనా..అక్కడ సీపిపై బిజెపి గురిపెట్టిందా..? కమలనాథుల హెచ్చరికలను ఎలా చూడాలి..? ఈ అంశంలో పోలీస్ కమిషనర్ ను టీఆర్ఎస్ ఎలా కాపాడుతుంది. కరీంనగర్ జిల్లాలో బిజెపి రాష్ట్ర చీఫ్ ఆఫ్ ఎంపీ బండి సంజయ్ జాగరణ దీక్ష తలపెట్టడం, అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడం, సంజయ్ అరెస్ట్ చకచకా జరిగిపోయాయి. కోర్టు ఆదేశాలతో జైలు నుంచి బయటకు వచ్చారు బండి సంజయ్.

దీక్షకు అనుమతి లేదని బిజెపి నాయకులకు ముందే చెప్పామన్నది కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ వాదన. అయితే సీపి కావాలనే దీక్షను అడ్డుకున్నారని ఆరోపిస్తోంది బిజెపి. ఈ సందర్భంగా బండి సంజయ్ పై గతంలో ఉన్న కేసులను తిరగదోడారని కాషాయ పార్టీ మండిపడుతోంది. సీపి సత్యనారాయణపై ప్రవీలేజ్ కమిటీకి, పార్లమెంట్ లోక్ సభ స్పీకర్ ఓంబీర్లాకు ఫిర్యాదు చేశారు సంజయ్. గతంలోనూ సి పి సత్యనారాయణ పై ప్రవిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు సంజయ్. ఆర్టీసీ సమ్మె సందర్భంగా ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందితే అక్కడే ఉన్న తనపై సీపి ఝాలం ప్రదర్శించారు అన్నది  బీజేపీ చీఫ్ ఆరోపణ. తాజా ఎపిసోడ్లలో పోలీసుల తీరు మోతాదుకు మించిందని కమలనాథులు గుర్రుగా ఉన్నారట. పోలీసులు లాఠీఛార్జి తో పాటు మహిళా నాయకులు క్యాడర్ పై దాడి చేశారని ఆరోపిస్తున్నారు బిజెపి కార్యకర్తలు. దీక్షను భగ్నం చేసే క్రమంలో పోలీసుల తీరు అభ్యంతరకరంగా ఉందని బిజెపి రాష్ట్ర ఇన్చార్జ్ తరుణ్ చుగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ నేతలు చెప్పినట్లుగా సీపీ ఆడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు ఆయన. ఈ ఆరోపణలపై స్పందించిన సీపి సత్యనారాయణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శ కాలు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో దీక్షను భగ్నం చేశామని ఇందులో ఎటువంటి రాజకీయ కోణం లేదని తెలిపారు.

 అయితే సీపి సత్యనారాయణపై తప్పకుండా చర్యలు ఉంటాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తరుణ్ చుగ్, బండి సంజయ్ లాంటి నేతలు ప్రకటనలు చేయడం చర్చగా మారింది. పాలకవర్గం చెప్పినవి పోలీస్ అధికారులు తూచా తప్పకుండా పాటించడంపై నుంచి వచ్చే ఆదేశాలతో ఎలా చెప్తే అలా వ్యవహరించడం నిత్యం జరిగేది. అది అన్ని ప్రభుత్వల్లోనూ ఉంది. కాకపోతే పొలిటికల్ పార్టీల మధ్య గొడవలతో పోలీసులు, ఇతర అధికారులు  నలిగిపోతున్నారని డిపార్ట్మెంట్ లో చెవులు కొరుక్కుంటున్నారు. అందుకే బీజేపీ ఫిర్యాదుల నుంచి సీపి సత్యనారాయణను టిఆర్ఎస్ సర్కార్ ఎలా కాపాడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: