కోవిడ్-19 తాజా వేరియంట్ ఓమిక్రాన్ ను ఎదుర్కోనేందుకు చాలా మంది వివిధ పద్దతులను అవలంబిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా కోవిడ్ పై చేసే పోరాటంలో తన వంతు పాత్రను పోషిస్తున్నాయి. భారత రాజధాని ఢిల్లీ నగరంలో కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రం ఏ చర్యలు తీసుకుందో తెలుస్తే వీూరూ వాటినే  ఆచరిస్తారు. జస్ట్ ఓ లుక్ వేద్దామా !
భారత్ లో కోవిడ్-19  వేగంగా వ్యాపిస్తున్న రాష్ట్రాల జాబితాలో ఢిల్లీ కూడా ఒకటి. కరోనాను కట్టడి చేసేందుకు ఆ రాష్ట్ర పాలకులు సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతున్నారు. చేయగలిగనదంతా చేస్తున్నారు. గడచిన 24 గంటల్లో కెసుల సంఖ్య పాతిక వేలు కొత్త కేసులు నమోదయ్యాయి. మరికొన్ని పరీక్షల రిపోర్టులు రావలసి ఉంది.అవి కనుక వస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. రోజు రోజుకూ క్షీణిస్తున్న కోవిడ్-19 పరిస్థితుల మధ్య ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టనెంట్ గవర్నర్ లు ఇద్దరూ వివిధ శాఖల అధికారులతో మరో దఫా సమావేశం అయ్యారు. పరిస్థితిని సమీక్షించారు.  తదుపరి కేజ్రీవాల్ మీడియా జనంతో మాట్లాడారు. ప్రైవేటు ఉద్యోగులందరూ నూటికి నూరు శాతం వర్క్ ఫ్రం హోం అమలు చేసేలాచర్యలు తీసుకున్నట్లు తెలిపారు. హోటళ్ల న్నీ కూడా టెక్ అవే పద్దతిని నడపాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ఏ హోటల్ లోనూ డైన్ ఇన్ పద్దతి ఉండరాదని ఆదేశాలు జారీ చేశామన్నారు.కోవిడ్ -19 తాజా వైరియంట్ విస్త్రుతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో వైద్య సదుపాయలను మరింత మెరుగు పరచి నట్లు తెలిపారు. అన్నింటి కన్నా ముఖ్యంగా ఆసుపత్రులలో వైద్యు సదుపాయాలు మెరుగు పరిచామన్నారు. ఇప్పటి వరకూ కరోనా పీడితులకు బెడ్ అందుబాటులో లేవు అన్న సమస్య ఏర్పడ లేదని తెలిపారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని అరవింద్ కేజ్రీవాల్ కోరారు. ప్రస్తుతానికి లాక్ డౌన్ విధించే అవకాశం లేదని ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం ఇంట్లో ఒంటరిగా ఉన్న రోగుల కోసం ప్రత్యేక యోగా ,  ప్రాణాయామం తరగతులను నిర్వహిస్తుందని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: