ప్రస్తుతం ప్రపంచదేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఏకైక శత్రువు మహమ్మారి "కరోనా". పేరుకు మూడు అక్షరాల పదమే అయినా ఇది చేసిన నష్టం కోలుకోలేనిది. గత రెండు సంవత్సరాలుగా మానవాళి పై పగపట్టిన్నట్లు తన విషపు కొర్రలతో మనల్ని బంధిస్తుంది. చిన్న-పెద్ద అనే తేడా లేకుండా అందరికి సోకుతూ..పురిటి బిడ్డ దగ్గర నుండి..పండు ముసలి వాళ్లను సైతం బలి తీసుకుంది. ఈ క్రమంలో నే మాయదారి మహమ్మారి కరోనా ధాటికి చాలా మంది కుటుంబాలు వాళ్ల పెద్ద దిక్కులని కోల్పోయారు. పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయారు. తల్లిదండ్రులకు బిడ్డలని..బిడ్డలకు తల్లిదండ్రులని దూరం చేసిన ఈ కరోనా సృష్టించిన అనార్ధాలు గురించి చెప్పుకుంటూ పోతే వస్తూనే ఉంటాయి.

ఒక్క రంగం అని వారినే కాకుండా అన్నీ రంగాల వారిని ఆర్ధికంగా దెబ్బతీసింది ఈ మహమ్మారి కరోనా. అయితే ఈ కరోనా మొదలైనప్పటి నుండి కూడా చాలా MNC కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారనే తమ ఉధ్యోగుల చేత పనులు చేయించుకుంటుంది. మొదట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం అందరికి  చాలా బాగానే అనిపించినా రాను రాను ఇంట్లో నుండి పని చేయడం వల్ల చాలా మానసిక ఒత్తిడులకు  గురి అవుతున్నట్లు పలు అధ్యాయనలో బయటపడ్డాయి.

ఇక ఈ మధ్యనే కరోనా కేసులు కొంత తగ్గుముఖం పట్టడంతో కొన్ని కంపెనీలు ఉద్యోగులను ఆఫీస్ కు వచ్చి పని చేసుకునే వెసులుబాటు కల్పించాయి. కొంత వరకు ప్రాబ్లం సాల్వ్ అయ్యిందని అనుకునే లోపే  ఈ మహమ్మారి ఎవ్వరు ఊహించని విధంగా మళ్లి విజృంభిస్తుంది. దీంతో పలు కంపెనీలు మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతికే ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు. ఇక తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త తెగ  వైరల్ గా మారింది. దీంతో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగులు హడలెత్తిపోతున్నారు. ఈ కరోనా మహమ్మారి అంత త్వరగా మనల్ని విడిచి పెట్టదని..ఇంకో పదేళ్లు ఇలానే వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతినే MNC కంపెనీలు  ఫాలో అవుతాయని అంటున్నారు. ఒక్కవేళ్ల అదే జరిగితే ఉద్యోగులకు మానసికంగా ఇబ్బందులు తప్పవంటున్నారు పరిశోధకులు.  

మరింత సమాచారం తెలుసుకోండి: