సాక్షిలో పెట్టుబడుల కేసులో ఏపీ సిఎం జగన్, ఇన్వెస్టర్లకు భారీ ఊరట లభించింది. పెట్టుబడులను క్విడ్ ప్రోకోగా చూడలేమని తేల్చిన ఆదాయపు పన్ను శాఖ అప్పిలేట్ ట్రైబ్యునల్....  ఆదాయపు పన్ను శాఖ అధికారుల నిర్ణయం చెల్లదని పేర్కొంది అప్పిలేట్ ట్రైబ్యునల్. 2007, 2008 లో 350 చొప్పున ప్రీమియంతో పలువురు పారిశ్రామికవేత్తలకు షేర్లు విక్రయించి రూ.292 కోట్లు సమీకరించింది జగతి పబ్లికేషన్ (సాక్షి). సాక్షిలో ఇతర కంపెనీల పెట్టుబడులను క్విడ్ ప్రోకోగా పరిగణిస్తూ గతంలో సి‌బి‌ఐ వేసిన చార్జ్ షీట్లను ఆధారంగా చూపింది ఐటిల శాఖ. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లోని 56, 58 సెక్షన్ల ఆధారంగా రూ.292 కోట్లు షేర్ ప్రీమియంపై అప్పట్లో పన్ను వేసింది ఆదాయపు పన్ను శాఖ. ఆదాయపు పన్ను శాఖ అధికారుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 2012, 2013లో ఐటి  అప్పిలేట్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించింది జగతి పబ్లికేషన్స్ (సాక్షి). రూ.10 ముఖ విలువ కలిగిన జగతి పబ్లికేషన్స్ షేర్ ను వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించక ముందే రూ.350 ప్రీమియంతో భారీ ధరకు కట్టబెట్టారంటూ ఐ‌టి శాఖ వాదనలు వినిపించింది. సి‌బి‌ఐ చార్జ్ షీట్ లో పేర్కొన్న అంశాల ఆధారంగా వాదించిన ఆదాయపు పన్ను శాఖ....  ట్రైబ్యునల్ కు సి‌బి‌ఐ చార్జ్ షీట్లను సమర్పించింది ఆదాయపు పన్ను శాఖ. 

సూట్ కేసు కంపెనీల ద్వారా జగన్ సంస్థల్లోకి నిధులు మళ్లించారంటూ చార్జ్ షీట్లో పేర్కొంది సి‌బి‌ఐ. జగతి పబ్లికేషన్ విలువను చాలా ఎక్కువగా చూపించడాన్ని కేసుకు ఆధారంగా చూపించింది సి‌బి‌ఐ. అన్ని వాదనలు విని 153 పేజీల తీర్పును వెలువరించిన ఆదాయపు పన్ను శాఖ అప్పిలేట్ ట్రైబ్యునల్....  షేర్ ప్రీమియం బోగస్ అంటూ చేసిన వాదనకు ఆధారాలు లేవని తెలిపింది  ట్రైబ్యునల్. జగతి పబ్లికేషన్ గానీ, అందులో పెట్టుబడి పెట్టిన సంస్థలు గానీ లెక్కల్లో చూపని ఆదాయంపై షేర్లు కొన్నట్టు ఆధారాలు లేవని వెల్లడించింది ట్రైబ్యునల్.  ఏపీ సిఎం జగన్ క్విడ్ ప్రోకో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగతి పెట్టుబడులను నగదు రూపంలో కంపెనీలేవీ చేయలేదన్న ట్రైబ్యునల్.... సూట్ కేసు కంపెనీలంటూ ఐటిద శాఖ చేసిన వాదనలను కొట్టి పారేసింది ట్రైబ్యునల్. కొన్ని కంపెనీలు తమ అడ్రస్ మారిందంటూ సంప్రదించినా కేంద్ర దర్యాప్తు సంస్థలు వాటిని పరిగణలోకి తీసుకోలేదన్న ట్రైబ్యునల్... జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన కంపెనీల ఆదాయంపై కోల్ కత్తా ఆదాయ పన్ను శాఖ ఇచ్చిన రిపోర్టును ప్రస్తావించింది ట్రైబ్యునల్.

మరింత సమాచారం తెలుసుకోండి: