దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల నగారా మోగింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మేఘాలయా, పంజాబ్, గోవా రాష్ట్రాలకు వచ్చే నెల పదవ తేదీ నుంచి మొత్తం ఏడు విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి పదవ తేదీన ఫలితాలు ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో అన్ని పార్టీలు ఎన్నికల కసరత్తు ప్రారంభించాయి. ఆ పార్టీల నేతలు అభ్యర్థుల ఎంపిక, ప్రకటనపై కసరత్తు ప్రారంభించారు. యూపీలో మరోసారి అధికారం నిలబెట్టుకునేందుకు కమలం పార్టీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. యూపీలో తొలి విడత పోలింగ్ రోజున 58 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులను ప్రకటించేందుక బీజేపీ అగ్రనేతలు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి ప్రస్తుత ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్‌తో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు స్వతంత్ర సింగ్ కూడా పాల్గొన్నారు. అలాగే పార్టీకి చెందిన ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు.

పశ్చిమ యూపీ ప్రాంతంలో తొలి విడత పోలింగ్ జరుగనుండగా... అక్కడి నియోజకవల్గాల్లో పార్టీ బలాలు, అభ్యర్థుల సమర్థత, ప్రజల్లో పార్టీపై ఉన్న అభిప్రాయం వంటి విషయాలపై కూడా నేతలు చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో... జనవరి 13వ తేదీన బీజేపీ తన అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఇప్పటికే రెండు విడతలు బీజేపీ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఒక జాబితాను రెడీ చేశారు కూడా. ఆ లిస్టును కేంద్ర కార్యాలయానికి పంపారు కూడా. ఇప్పుడు ఆ జాబితాపైనే చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఇప్పటికే ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో పని తీరు సరిగ్గా లేని వారిని పక్కన పెడుతుందని ఇప్పటికే పార్టీలో చర్చ జోరుగా నడుస్తోంది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు జాతీయ సంస్థ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, ఎన్నికల ఇన్‌ఛార్జ్ ధర్మేంద్ర, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ సునీల్ బన్సాల్ హాజరయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

bjp