కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. గత ఏడాది లో కూడా కేసులు పెరగడం వల్ల లాక్ డౌన్ ను విధించారు. ఇప్పుడు కరోనా నియంత్రణ లో భాగంగా వ్యాక్సిన్ వచ్చిన కూడా కేసులు పెరగడం జరుగుతుంది. గడిచిన 24 గంటల్లో వ్యవధి లో 83,153 శాంపిల్స్ టెస్ట్ చేయగా 1920 మంది కి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,97,775కి చేరింది. కరోనా కారణం గా 2 మృతి చెందారు. దీంతో రాష్ట్రం లో మొత్తం కరోనా మృతుల సంఖ్య 4,045కి చేరింది.


కొత్తగా 24 గంటల వ్యవధి లో 417 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. కొత్తగా కోలుకున్న వారితో కలిపి రాష్ట్రం లో మొత్తం రికవరీల సంఖ్య 6,77,234 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 16,496 యాక్టివ్ కేసులున్నాయి. నేటివరకు రాష్ట్రం లో 3,02,77,738 శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు వైద్య రోగ్య శాఖ తెలిపింది. కాగా కొత్తగా నమోదైన కేసుల్లో.. జీహెచ్ఎంసీ పరిధిలోనే 1015, రంగారెడ్డి159, మేడ్చెల్ 205 పాజిటివ్ కేసులు పెరిగినట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా దేశ వ్యాప్థంగా చూస్తె.. కాస్త కేసులు తగ్గినట్లు తెలుస్తుంది.


కరోనా వల్ల మరో 277మంది ప్రాణాలు విడిచారు. మరో 69,959 మంది వ్యాధి బారి నుంచి కోలుకున్నారు. హెల్త్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు బూస్టర్ డోస్ ఇస్తున్నారు. సోమవారం ఒక్కరోజే 92,07,700 డోసులు అందించారు. ఫలితం గా ఇప్పటి వరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,52,89,70,294 కు చేరింది. దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 4,461 ఒమిక్రాన్ కేసులు గుర్తించినట్లు ఆరోగ్య శాఖ పెర్కొంది. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: