ఇంకా తమ బలం తగ్గలేదని వైసీపీ నేతలు అనుకుంటున్నారా? అసలు తమకు ఇంకా తిరుగులేదని భావిస్తున్నారా? మరో 30 ఏళ్ళు జగన్ సీఎంగా ఉంటారనే కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది? అసలు క్షేత్ర స్థాయిలో ఉండే వాస్తవ పరిస్తితులు జగన్‌కు తెలుస్తున్నాయా?అంటే ఏమో డౌట్ అనే చెప్పొచ్చు. జగన్‌కు క్షేత్ర స్థాయిలో ఉండే పరిస్తితులు తెలియడం లేదని అనుకోవచ్చు. ఎందుకంటే ఆయనతో కింది స్థాయి కార్యకర్తలు మాట్లాడటం లేదు. అలా అని ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా జగన్‌తో పెద్దగా మాట్లాడే ఛాన్స్ దొరకడం లేదు.

కానీ పైకి మాత్రం వైసీపీ నేతలు మీడియాలో బాగా కాన్ఫిడెన్స్‌తో మాట్లాడుతున్నారు. అసలు తమకు తిరుగులేదన్నట్లే చెబుతున్నారు. ఇంకో 30 ఏళ్ళు జగనే సీఎంగా ఉంటారని అంటున్నారు. సరే మరో 30 ఏళ్ళు సీఎంగా ఉండాలంటే..అసలు నెక్స్ట్ జగన్ సీఎం అవ్వాలి. మరి ఆ పరిస్తితి ఉందా? అంటే పెద్దగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఏదైనా వాస్తవ పరిస్తితులు మాట్లాడుకోవాలి...ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో అధికార వైసీపీపై ప్రజా వ్యతిరేకత పెరుగుతుందనే చెప్పొచ్చు.

గత ఎన్నికల్లో వైసీపీకి ఉన్నంత ఊపు ఇప్పుడు లేదు...ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఒకవేళ వైసీపీకి ఇప్పుడు లీడ్ ఉండొచ్చు...అలా అని పూర్తి స్థాయిలో లీడ్ లేదు. కాస్త తగ్గింది. అదే సమయంలో టీడీపీ పుంజుకుంటుంది. ఇక వైసీపీలో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతుంది. ఇటీవల వస్తున్న కొన్ని సర్వేల్లో 50 మందిపైనే ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత వచ్చిందని తెలుస్తోంది.


రెండున్నర ఏళ్లలో ఇంత వ్యతిరేకత వచ్చిందంటే..మరి నెక్స్ట్ రెండున్నర ఏళ్లలో పరిస్తితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. కాబట్టి జగన్‌కు వాస్తవ పరిస్తితులు తెలియాల్సి ఉంది. అయితే ప్రశాంత్ కిషోర్ టీం రంగంలోకి దిగుతుందని జగన్ అన్నారు...మరి పీకే టీం రంగంలో దిగిందో లేదో ఎవరికి తెలియడం లేదు. మొత్తానికైతే రాష్ట్రంలో అసలు సీన్ జగన్‌కు అర్ధం కావడం లేదనే చెప్పొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: