పంజాబ్ లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలతో అందరిలో ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ప్రముఖ నటుడు, సామాజిక సేవ ద్వారా జాతీయస్ధాయిలో పేరు సంపాదించుకున్న సోనూసూద్ సోదరి మాళివికా సూద్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాబోయే ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ తరపున మోగా నియోజకవర్గంలో పోటీ చేయటం ఖాయమైంది. ఎందుకంటే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగ్జీత్ సింగ్ చన్నీ చెప్పారు కాబట్టి. మాళవిక పార్టీలో చేరినా సోనూ మాత్రం చేరలేదు. కాకపోతే మద్దతుగా నిలబడతానని చెప్పారు.






నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ, చన్నీ ల సమక్షంలో మాళవిక కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. మామూలుగా ఏ విషయంలో కూడా సిద్దూకి చన్నీకి పడటంలేదు. అయితే మాళవిక చేరిక కార్యక్రమంలో మాత్రం ఇద్దరు పాల్గొన్నారు. అంటే సోనూసూద్ కు ఇద్దరు బాగా కావాల్సిన వారు కావటంతో ప్రోగ్రామ్ బాగా జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మాళవిక అసలు కాంగ్రెస్ లో ఎందుకు చేరారని. ఎందుకంటే తొందరలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవటం ఖాయమని ప్రీ పోల్ సర్వేల్లో తేలింది.






సింగిల్ లార్జెస్టు పార్టీగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నిలుస్తుందని కూడా సర్వేలు చెబుతున్నాయి. అలాంటపుడు ఎవరైనా గెలిచేపార్టీలో చేరాలని అనుకుంటారు కానీ ఓడిపోయే పార్టీని ఎందుకు ఎంచుకుంటారు ? కానీ సూద్ విషయం రివర్సులో నడిచింది. అంటే సోనూసూద్ పై కాంగ్రెస్ బాగానే ఆశలు పెట్టుకున్నట్లుంది. సర్వే ఫలితాలను సోనూ తల్లకిందులు చేసి మళ్ళీ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తాడని బలంగా నమ్ముతున్నట్లుంది. ఇపుడు అందరివాడుగా ఉన్న సోనూసూద్ ఇప్పటినుండి కాంగ్రెస్ వాదిగా మారిపోయారు.






కాంగ్రెస్ పార్టీ కోణంలో ఇది బాగానే ఉంది. కానీ సోనూసూద్ విషయమే అర్ధం కావటంలేదు. దేశంలోని ఇతర ప్రాంతాల వాళ్ళు కూడా పంజాబ్ లో అధికారంలోకి రాబోయేది ఆప్ అనే నమ్ముతున్నపుడు ఇదే విషయం సోనుకు తెలీకుండానే ఉంటుందా ? పార్టీ గెలుపోటములను అంచనా వేయకుండానే తన సోదరిని కాంగ్రెస్ లో చేర్పించుంటారా ? ఆప్ పెద్దలతో సోనూ గతంలో సమావేశమయ్యారు కూడా. మొత్తానికి సోనూసూదే పంజాబ్ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్ అవుతారని కాంగ్రెస్ నమ్ముతున్నట్లుంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: