దేశ‌వ్యాప్తంగా క‌రోనా, ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్నాయి. వారు వీరు అని తేడా లేకుండా సినీ ప్ర‌ముఖుల‌కు, రాజ‌కీయ నాయ‌కులకు, ఉద్యోగ‌స్తుల‌కు, డాక్ట‌ర్ల‌కు అంద‌రికీ  సోకుతుంది. చాలా వ‌ర‌కు బ‌య‌టికి వెళ్ల‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని నిపుణులు పేర్కొంటున్న ప్ర‌జ‌లు మాత్రం పెడ‌చెవిన పెట్ట‌కుండా క‌రోనా బారిన ప‌డుతున్నారు. ముఖ్యంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఉద్యోగుల‌కు కొవిడ్ పాజిటివ్ నిర్థార‌ణ అయితే వారికి వేత‌నంతో కూడిన సెలవును ప్ర‌క‌టించిన‌ది. ఆ రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుద‌ల‌తో యూపీ సీఎం కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

ఇందులో భాగంగా ప్ర‌భుత్వ, ప్ర‌యివేటు కార్యాల‌యాల్లో ఉద్యోగుల హాజ‌రును 50 శాతానికి ప‌రిమితం చేసారు. ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు కార్యాల‌యాల్లో కొవిడ్ హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. అలాగే ఉద్యోగులు ఎవ‌రికైనా క‌రోనా పాజిటివ్ నిర్థార‌ణ అయినట్ట‌యితే వారికి జీతం కూడిన ఏడు రోజులు సెల‌వులు ఇవ్వాల‌ని సూచించారు. యూపీలో క‌రోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ విప‌రీతంగా పెరుగుతూ ఉన్నాయి. గ‌డిచిన 24 గంటల్లో 8,334 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్థార‌ణ అయింది. ప్ర‌స్తుతం ఆ రాష్ట్రంలో 33,964 కొవిడ్ యాక్టివ్ కేసులున్నాయి. అందులో 33,563 మంది హోం ఐసోలేష‌న్ లో ఉన్నారు. అయితే మ‌రికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు ఉండ‌టంతో అక్క‌డ కొవిడ్‌ను అరిక‌ట్టేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంది.ఇందులో భాగంగా ఆఫీసుల్లో స్క్రీనింగ్ లేకుండా ఎవ‌రికీ క‌ల్పించ‌రాద‌ని సీఎం ఆదిత్యనాథ్ కోరారు.

అలాగే సంస్థ‌లు ఇంటి నుండి ప‌ని చేసేవిధంగా ప్రోత్స‌హించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అంతేకాకుండా ఆసుప‌త్రిలో కొవిడ్ తాకిడిని త‌గ్గించేందుకు ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ ఇవ్వాల‌ని ప్ర‌త్యేక సంద‌ర్భాల‌లో రోగుల‌ను ఆసుప‌త్రుల‌ను పిలిపించార‌ని సీఎం సూచించారు. ఎన్నిక‌లు ముందుగానే వంద‌శాతం వ్యాక్సినేష‌న్ పూర్తిచేసే దిశ‌గా పిలిపించాల‌ని సీఎం సూచించారు. ఎన్నిక‌లు ముందుగానే వంద‌శాతం వ్యాక్సినేష‌న్ పూర్తి చేసే దిశ‌గా ప‌ని చేయాల‌ని.. అంద‌రినీ కోరారు. క‌రోనా క‌ట్ట‌డికీ ఢిల్లీ ప్ర‌భుత్వం కూడా ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం అవ‌కాశాన్ని క‌ల్పించిన‌ది.  అయితే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఉద్యోగుల‌కు క‌రోనా వ‌స్తే జీతంతో కూడిన వేత‌నం ఇస్తాన‌న‌డం ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలోనే ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని పలువురు పేర్కొంటున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: