తెలంగాణ‌లో ష‌ర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీగా నిర్ణ‌యించారు షర్మిల‌. పేరుపై ఎన్నిక‌ల సంఘం కూడా రిజిస్ట‌ర్ చేసింది. తెలంగాణ‌లో ష‌ర్మిల పెట్ట‌బోయే పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపును ఇచ్చింది. పార్టీ పేరును వైఎస్సార్ తెలంగాణ పార్టీ కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆమోదం తెలిపింది. వైఎస్సార్టీపీకి ష‌ర్మిల ప్ర‌ధాన అనుచ‌రుడు వాడుక చైర్మ‌న్ వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఇప్ప‌టికే ష‌ర్మిల తెలంగాణ వ‌ర్త‌మాన వ్య‌వ‌హారాలపై చురుగ్గా స్పందిస్తున్న సంగ‌తి తెలిసిందే.

తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఆశ‌యాల సాధ‌నే ల‌క్ష్యంగా తెలంగాణ‌లో నూత‌న పార్టీని స్థాపించారు ష‌ర్మిల‌. అయితే ఆమెకు ఆదిలోనే ఎదురు దెబ్బ త‌గిలింది. వైఎస్సార్‌టీపీ రిజిస్ట్రేష‌న్‌కు అడ్డంకులు ఏర్ప‌డ్డాయి. వైఎస్ఆర్‌టీపీ రిజిస్ట్రేష‌న్‌కు చేసుకున్న పార్టీకి అభ్యంత‌రాలు వ‌చ్చాయి అని ఎన్నిక‌ల క‌మిష‌న్ వెల్ల‌డించింది. ఇప్ప‌టికే అన్న వైఎస్సార్ పేరుతో తెలంగాణ‌లో పార్టీ ఏర్పాటు చేసిన వారు ష‌ర్మిల కొత్త పార్టీ పేరుపై ఈసీకి ఫిర్యాదు చేసారు.

వైఎస్సార్‌టీపీ పేరు త‌మ పార్టీని పోలిఉందంటూ అన్నా వైఎస్సార్‌పార్టీ అధ్య‌క్షులు షేక్ భాషా ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు 2021 నవంబ‌ర్ నెల‌లో ఫిర్యాదు చేశారు. భాషా ఫిర్యాదును స్వీక‌రించిన ఈసీ.. వైఎస్సార్‌టీపీ గుర్తింపుపై ప‌రిశీలిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన‌ది. ఈ త‌రుణంలో జ‌న‌వ‌రి 03న ఎన్నిక‌ల క‌మిష‌న్ వైఎస్సార్‌టీపీకి లేఖ రాసింది. ఈ వివాదం ఎలాంటి మ‌లుపులు తిరుగుతుందో చూడాలి. ఇదిలా ఉండ‌గా తెలంగాణ‌లో రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఆశ‌యాల సాధ‌నే ల‌క్ష్యంగా వైఎస్ ష‌ర్మిల గ‌త ఏడాది వైఎస్సార్‌జ‌యంతి సంద‌ర్భంగా వైఎస్సార్‌టీపీ అంకురార్పున చేసిన విష‌యం తెలిసిన‌దే. ఆరోజు పార్టీ జెండాను ఆవిష్క‌రించారు ష‌ర్మిల‌.

తెలంగాణ‌లో ప‌లు ప్ర‌జా స‌మ‌స్య‌లై త‌నదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లు ర‌కాల దీక్ష‌ల పేరుతో ప్ర‌జ‌ల్లోకి వెళుతున్నారు ష‌ర్మిల‌. ఇప్ప‌టికే తెలంగాణ‌లో నెల‌కొన్న ప‌లు స‌మ‌స్య‌ల‌పై స్పందిస్తున్నారు. ముఖ్యంగా చేవెళ్ల జిల్లాలో ప్ర‌జాప్ర‌స్థానం పేరిట పాద‌యాత్ర‌ను ప్రారంభించి వైఎస్సార్ చేసిన ప్ర‌భంజ‌నం గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా ప్ర‌జాప్ర‌స్థానం పాద‌యాత్ర‌ను అక్టోబ‌ర్ 20, 2021లో చేవెళ్ల నియోజ‌క‌వ‌ర్గంలో ష‌ర్మిల త‌ల్లి వైఎస్ విజ‌య‌మ్మ ప్రారంభించారు. ఆ స‌మ‌యంలో వైఎస్సార్ పాల‌న స్వ‌ర్ణ‌యుగం లాంటిది అని, తెలంగాణ‌లో వైఎస్సార్ తీసుకొచ్చిన ప‌థ‌కాల గురించి గుర్తు చేసారు. రైతుల‌కు పంట రుణాలు, ఆరోగ్య‌శ్రీ వంటి సంక్షేమ ప‌థ‌కాల గురించి వారు వివ‌రించారు. ష‌ర్మిల‌తో పాటు త‌ల్లి విజ‌య‌మ్మ కూడా దాదాపు అప్పుడు రెండున్న‌ర కిలోమీట‌ర్ల పాటు పాద‌యాత్ర నిర్వ‌హించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: