గెలిచినా ఓడినా మేం ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే ఉంటాం అన్న ఫిలాస‌ఫీని రాజ‌శేఖ‌ర్రెడ్డి బాగానే అల‌వాటు చేశారు మ‌న నాయ‌కుల‌కు.ఆ రోజు ఆ ఫిలాస‌ఫీ ఎంతో బాగా ప‌నిచేసింది.పాద‌యాత్ర‌లో రాజ‌శేఖ‌ర్రెడ్డి లెక్క‌కు మిక్కిలి క్రేజ్ తెచ్చుకున్నారు.ప్ర‌జాభిమానం ద‌క్కించుకుని సీఎం అయ్యారు.ఒక్క‌సారి కాదు రెండు సార్లు.ఆ రోజు మీడియాపై యుద్ధం చేస్తే రాజ‌శేఖ‌ర్రెడ్డే గెలిచారు.ఆ రెండు పేప‌ర్ల స్థానంలో మరో రెండు పేప‌ర్ల‌ను తేవ‌డంలోనూ, ఒక ఛానెల్ పుట్టుక‌కూ,ఒక వెబ్ పోర్ట‌ల్ పుట్టుక‌కూ ఆయ‌నే ప్ర‌ధాన కార‌కుల‌య్యారు.


ఆ విధంగా మార్కెట్లోకి సూర్య‌, సాక్షి అనే రెండు మీడియాలు వ‌చ్చిన‌యి.ఇప్పుడు సూర్య పెద్ద‌గా లేదు.ఆన్లైన్ ఎడిష‌న్ వ‌ర‌కూ ప‌రిమితం అయి ఉంది కానీ అది కూడా చెప్పుకోద‌గ్గ స్థాయిలో లేదు.ఇక సాక్షి న‌డ‌క బాగానే ఉన్నా ఆశించిన ఆర్థిక ప్ర‌గ‌తి లేదు.ఇవ‌న్నీ ఎందుకు అంటే త‌న‌కంటూ ప్ర‌త్యేక మీడియాను త‌న క‌నుస‌న్న‌ల్లోనే న‌డిపే బాబు ఇవాళ నిర్వేదంతో ఉన్నారు. ఒక‌వేళ మ‌ళ్లీ ఓడిపోతే ఇక త‌మ పార్టీ గ‌తేం కాను అన్న బాధ‌లోనూ ఉన్నారు. ఆ రోజు వైఎస్సార్ రెండు సార్లు వ‌రుస‌గా బాబును ఓడించి..ప్ర‌జాభిమానం అందుకున్నారు.పాద‌యాత్ర ఫ‌లితం ఓ సారి, రెండోసారి కాస్తో కూస్తో పీఆర్పీ రాక కార‌ణం..ఇవ‌న్నీ వ‌చ్చిన‌యి క‌నుక ఆ రోజు నేను పాస్ అన్నారు..క‌నుక వైఎస్ పాస్ బాబు ఫెయిల్.

మళ్లీ ఇన్నేళ్ల‌కు బాబు ఫెయిల్ జ‌గ‌న్ పాస్
ఆ విధంగా జ‌గ‌న్ ఇవాళ దూసుకుపోతున్నార‌ని బాబే ఒప్పుకుంటున్నారు కొన్ని ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో! టీడీపీతో పోలిన త‌ప్పిదాలు మాత్ర‌మే వైసీపీ చేస్తుంది.కొత్త త‌ప్పిదాలు పెద్ద‌గా ఏం లేవు.అయితే టీడీపీ నాయ‌కుల క‌న్నా భాష విష‌య‌మై అత్యంత దారుణంగా ఉంది.టీడీపీ హ‌యాంలో రోడ్ల‌కూ ఇప్ప‌టి రోడ్ల‌కూ పెద్ద తేడా ఏం లేదు కానీ..ఆ రోజు డ‌బ్బుల‌న్నీ అమ‌రావ‌తికి పెడితే..
ఇప్పుడు డ‌బ్బుల‌న్నీ సంక్షేమాల‌కు వెచ్చించి నోట్ల క‌ట్ట‌లు ఎటువంటి ముంద‌స్తు ఆలోచన లేకుండా పంచుతున్నారు.ఆ రోజు
అమ‌రావ‌తిని రియ‌ల్ వెంచ‌ర్ అని అన్నారు..ఇప్పుడూ అదే చేస్తున్నారు జ‌గన్..ఆర్థిక నేరాల‌న్న‌వి ఆ రోజు ఈ రోజు అధికారికంగా సాగిపోతున్నాయి.క‌నుక వ‌చ్చే ఎన్నిక‌ల్లో బాబు ఓడిపోతే చావు దెబ్బ టీడీపీకి రెండో సారి కావ‌డం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: