ఇప్పుడు మళ్ళీ కరొనా మహమ్మరి విజ్రుంభిస్తున్న నేపథ్యం లో జనాలు భయంతో వణికి పోతున్నారు. ఇప్పుడు కరోనా వ్యాక్సినేషన్ ను వేగవంతం చేసిన  కూడా కేసులు అంతకు అంత పెరుగుతున్నాయి.. మరో వైపు ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి.  ఇలా వరుసగా మళ్ళీ జనాలను భాధిస్తున్నాయి. భారత దేశం లో మాత్రమే కాదు అమెరికా లో కూడా అంతే రేంజ్‌ లో కేసులు పెరుగుతూన్నాయని ఆరోగ్య శాఖ వెల్లడించారు..


అమెరికా ఒమిక్రాన్‌ బీభత్సానికి చిగురుటాకులా వణికి పోతోంది. రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య పెరిగిపోవడమే తప్ప తగ్గుదల కనిపించడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడా లేని విధంగా కేసులు అమెరికా లో కేసులు పెరిగినట్లు తెలుస్తుంది..మరే దేశం లో లేని విధంగా సోమవారం ఒక్కరోజే ఏకంగా 13 లక్షల 50 వేల కేసులు నమోదయ్యాయి. శని, ఆదివారాల్లో రాష్ట్రా లేవీ కేసులు రికార్డు చేయని కారణంగా సోమవారం నాటికి తారాస్థాయికి కేసులు చేరుకుంటున్నాయి. గత 3 వారాల్లో ఆస్పత్రు లో చేరే వారి సంఖ్య రెట్టింపు అయింది. వర్జీనియా, టెక్సాస్, కెంటకీ, కన్సాస్, చికాగోల లో వైద్యుల్ని ఇతర రాష్ట్రాల నుంచి తీసుకురావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.


చైనా లో మరో నగరం లో లాక్‌ డౌన్‌.. కోవిడ్‌-19 విలయానికి చైనాలో మూడో నగరం మూత బడింది. 55 లక్షల జనాభా ఉన్న అన్యాంగ్‌ నగరం లో లాక్‌డౌన్‌ విధించి మూకుమ్మడి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జియాన్, యుఝో నగరాల్లో లాక్‌డౌన్‌ విధించారు. మూడు అతిపెద్ద నగరాల్లో లాక్‌డౌన్‌ విధించడంతో దాదాపుగా 2 కోట్ల మంది ప్రజలు ఇళ్ల కే పరిమితమయ్యారు. ఇక మన దేశం లో కూడా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యం లో  జనాలను అధికారులు అప్రమత్తం చెస్తున్నారు.. స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: