ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని అమరావతి వాతావరణ శాఖ స్పష్టం చేసింది. నైరుతిబంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితలఆవర్తనం సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్లు ఎత్తు వరకు వ్యాపించియున్నది. ఆంధ్రప్రదేశ్ లో దక్షిణ మరియు ఆగ్నేయ గాలులు తక్కువ ఎత్తులో వీస్తున్నాయి. దీని ఫలితంగాఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.

ఉత్తర కోస్తా ఆంధ్ర: ఈరోజు  తేలికపాటి వర్షాలు  ఒకటి లేదా రెండు చోట్ల కురిసే  అవకాశముంది.   రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుముల తో కూడిన జల్లులు  కొన్ని  చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు లేదా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుముల తో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.  ఉరుములు లేదా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

దక్షిణ  కోస్తా ఆంధ్ర: ఈరోజు  తేలికపాటి వర్షాలు  ఒకటి లేదా రెండు చోట్ల కురిసే  అవకాశముంది .   రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుముల తో కూడిన జల్లులు  కొన్ని  చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు లేదా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుముల తో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.  ఉరుములు లేదా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

రాయలసీమ : ఈరోజు, రేపు, మరియు  ఎల్లుండి  తేలికపాటి వర్షాలు  ఒకటి లేదా రెండు చోట్ల కురిసే  అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రము ప్రకటన చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: