జగన్ సర్కారు తన సొంత పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు మరోసారి షాక్ ఇచ్చింది. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఆయన నివాసానికి వెళ్లిన ఏపీ సీఐడీ పోలీసులు ఆయనకు మరోసారి నోటీసులు ఇచ్చారు. సీఐడీ విచారణకు హాజరుకావాలని కోరారు. గతంలో జగన్‌పై చేసిన వ్యాఖ్యల విషయంలో సీఐడీ కేసు నమోదు చేసింది. ఆ కేసు విచారణ కోసం రేపు విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. అయితే చాలా రోజుల తర్వాత ఎంపీ రఘురామ కృష్ణంరాజు తన సొంత నియోజకవర్గం నరసాపురంలో రేపటి నుంచి రెండు రోజులు పర్యటించాలని అనుకున్నారు.


ఎంపీ రఘురామ కృష్ణంరాజు తన నరసాపురం పర్యటన గురించి మొన్న విలేఖరులకు వెల్లడించారు. తన పర్యటనలో వైసీపీ నిరసన ఉంటాయని.. పోలీసులు, ఇతర నిఘా తనపై ఉంటుందని తెలుసని అన్నారు. తనకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఏపీ పోలీసులదే అన్నారు. మరి సొంత నియోజకవర్గానికి వెళ్లాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు భావించిన సమయంలో ఏపీ సీఐడీ నోటీసులు ఇవ్వడం కలకలం రేపుతోంది. ఇది ఎంపీ రఘురామ కృష్ణంరాజు పర్యటనను అడ్డుకునేందుకే అన్న వాదన కూడా వినిపిస్తోంది.


అయితే.. ఎంపీ రఘురామ కృష్ణంరాజు త్వరలోనే పార్టీకి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. వైసీపీని ఇబ్బంది పెడుతున్న ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ఏదోలా బుద్ది చెప్పాల్సిందేనని వైసీపీ నేతలు కూడా భావిస్తున్నారు. కానీ..ఎంపీ రఘురామ కృష్ణంరాజు బాగా పలుకుబడి కలిగిన నాయకుడు.. మోడీ, అమిత్‌షా వంటి వారి అపాయింట్‌ మెంట్ కూడా సులభంగా సాధించగలిగిన సత్తా ఉన్నవాడు. అందుకే ఎంపీ రఘురామ కృష్ణంరాజు విషయంలో వైసీపీ ఆచి తూచి అడుగులు వేస్తోంది.


ఎలాగూ రాజీనామా చేసి వెళ్లాలనుకుంటున్న ఎంపీ రఘురామ కృష్ణంరాజును మరి ఇంకా వైసీపీ సర్కారు విచారణ పేరుతో ఇబ్బంది పెడుతోందా.. అనవసరంగా ఎంపీ రఘురామ కృష్ణంరాజుతో మళ్లీ వివాదం పెట్టుకుంటున్నారా అన్న వాదన కూడా లేకపోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: