ప్రస్తుతం భారత్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఒకవైపు ఓమిక్రాన్ కేసులు పెరిగిపోతుంటే మరోవైపు కరోనా వైరస్ కేసులు కూడా భారీగానే పెరుగుతున్నాయి. దీంతో భారత్లో మూడవ దశ ప్రారంభమైంది అని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే ఎన్నో రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మళ్ళీ కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు వస్తూ ఉండడం గమనార్హం. ఇక కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికే కరోనా వైరస్ ను కంట్రోల్ చేసేందుకు నైట్ కర్ఫ్యూ విధించడం లాంటివి కూడా చేశారు. ప్రజలందరూ తప్పనిసరిగా ప్రభుత్వానికి సహకరించాలని  వైరస్ నివారణకు తగిన జాగ్రత్తలు పాటించాలి అంటూ ఎప్పటికప్పుడు అధికారులు అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు.



 అయితే ప్రభుత్వం కరోనా వైరస్ కట్టడికి సహకరించాలని ఎంత మొత్తుకున్నా ప్రజలు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయ్. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. మధ్యప్రదేశ్లో కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపడుతూ ఉంది. వేడుకలకు జనాల ను పరిమితికి మించి అనుమతించడం లేదు.  కానీ మధ్యప్రదేశ్లోని రాజ్ గడ్ జిల్లాలోని ఓ గ్రామంలో గ్రామస్తులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఓ వానరం మృతిచెందడంతో దానికి గ్రామస్తులందరూ సాంప్రదాయబద్దంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఇక ఈ అంత్యక్రియలకు ఎలాంటి కరోనా నిబంధనలు పాటించకుండా గ్రామస్తులు అందరూ కదలి వచ్చారు.


 ఈ అంత్యక్రియల్లో దాదాపు 1500 మంది పాల్గొన్నట్లు తెలుస్తోంది. అంతేకాదండోయ్ గ్రామస్తులందరూ చందాలు వేసుకొని ఇక భోజన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి అందరూ కలిసి భోజనం చేశారు. అయితే వానరం గురించి ఆలోచించారు కానీ  కరోనా వైరస్ సోకితే ప్రాణాలు పోతాయ్ అన్న విషయాన్ని మాత్రం మరిచిపోయారు అన్నది అర్ధమవుతుంది. కరోనా వ్యాప్తి చెందుతుంది అని భయం ఎవరిలో కనిపించడం లేదు. అయితే ఈ స్థాయిలో ప్రజలు ఒకే చోట  గుమి గూడ టం తో ప్రభుత్వం మాత్రం దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణకు  అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: