కనిపించని శత్రువుతో పోరాటం చేస్తూ రెండు దశల కరోనా వైరస్ ను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాయ్ ప్రపంచ దేశాలు. సౌతాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కొత్త వేరియంట్ ఓమిక్రాన్ తో భయాందోళనలో మునిగిపోతున్నారు. ఇప్పటివరకు వ్యాప్తిచెందిన వేరియంట్ల కంటే ఇక ఈ కొత్త వేరియంట్ను ఎంతో ప్రమాదకరం అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేస్తున్న తరుణంలో అందరూ భయం గుప్పెట్లో కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడిప్పుడే రెండోదశ కరోనా వైరస్ ప్రభావం తగ్గిందని ఆనందపడుతున్నాం.. అంతలోనే ఓమిక్రాన్ రూపంలో మరో మృత్యువును పంపిస్తున్నావా  అంటూదేవుడి దగ్గర తమ బాధలు చెప్పుకున్నారు ఎంతోమంది.


 అయితే సౌతాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఓమిక్రాన్ వేరియంట్ చూస్తూ చూస్తూండగానే శరవేగంగా ప్రపంచాన్ని చుట్టేస్తుంది. చాప కింద నీరులా అన్ని దేశాలకు పాకి పోతుంది. ముఖ్యంగా యూరప్ అమెరికా దేశాలను ఓమిక్రాన్ వర్తిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అమెరికాలో ప్రతిరోజూ 11 నుంచి 13 లక్షల కేసులు నమోదవుతున్నాయి. దీంతో అమెరికాలోని ఎన్నో రాష్ట్రాలలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన పరిస్థితి వచ్చింది. అదే సమయంలో అటు భారత్ లో కూడా ఈ మహమ్మారి వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతుంది అన్నది ప్రస్తుతం గణాంకాలు చెబుతున్నాయి.


 ఓమిక్రాన్ వ్యాప్తి కారణంగానే భారత్లో కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి అన్నది అర్ధమవుతుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అపడమాలాజీ  సైంటిఫిక్ అడ్వైజరీ కమిటీ చైర్పర్సన్ డాక్టర్ జయప్రకాష్ ఓమిక్రాన్ వేరియంట్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం ఎంతో కష్టం అంటూ వ్యాఖ్యానించారు. ఇది ఒక అన్ స్టాపబుల్ వేరియంట్ అంటూ చెప్పుకొచ్చారు ఆయన. వ్యాధిని కంట్రోల్ చేయొచ్చు కానీ వైరస్ ను కంట్రోల్ చేయడం మన వల్ల కాదని దానంతట అదే సమసి పోవాలి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే వ్యాధి లక్షణాలను తగ్గించేందుకు ప్రస్తుతం వైద్య చికిత్స అందుబాటులో ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఓమిక్రాన్ వేరియంట్లో లక్షణాలు తక్కువగా ఉన్నప్పటికీ వ్యాధి ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయడానికి  లేదని మిగతా దేశాలతో పోలిస్తే భారత్ లో ముప్పు తక్కువగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: