చంద్రబాబు ట్రాప్‌లో జనసేన నేతలు పడ్డారా? పొత్తు గురించి పరోక్షంగా చంద్రబాబు చేసిన కామెంట్లకు జనసేన నేతలు తొందరపడి స్పందిస్తున్నారా? అంటే పవన్ మాటలు బట్టి చూస్తే అదే నిజమనిస్తుంది. ఇటీవల పొత్తు గురించి చంద్రబాబు పరోక్షంగా వన్ సైడ్ లవ్ కుదరదని, లవ్ రెండువైపులా ఉండాలంటూ మాట్లాడారు. అంటే తాను పొత్తుకు రెడీ అయిన, పవన్ కల్యాణ్ రెడీ అవ్వలేదన్నట్లు మాట్లాడారు.

అయితే చంద్రబాబు మాటలపై జనసేన నేతలు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. కొందరు నేతలైతే టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని మాట్లాడుతున్నారు. కొందరు మాత్రం పవన్‌కు సీఎం సీటు ఇస్తే, పొత్తు పెట్టుకోవడానికి రెడీ అన్నట్లు మాట్లాడుతున్నారు. ఇక ఈ పొత్తు వ్యాఖ్యలపై పవన్ తాజాగా స్పందించారు. పార్టీ నేతలతో టెలీ కాన్ఫిరెన్స్‌లో మాట్లాడుతూ..పొత్తులపై ఎవరు తొందరపడి మాట్లాడొద్దని, అలాగే పొత్తుపై తానొక్కడినే నిర్ణయం తీసుకోనని,  నాయకులని, కార్యకర్తలని అడిగి నిర్ణయిద్దామని అన్నారు.

ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్నామని, ఈ వ్యవహారంలో అంతా ఒకటే మాట మీద ఉందామన్నారు. ఎవరు ఏం మాట్లాడినా.. మైండ్ గేంలు ఆడినా మనం మాత్రం పావులు కావద్దని, ముందు పార్టీ సంస్థాగత నిర్మాణం మీద దృష్టి సారిద్దామని చెప్పారు. అంటే ఇక్కడ బాబు మైండ్ గేమ్ ఆడారని పవన్ పరోక్షంగా చెప్పారా? అనేది అర్ధమవుతుంది. ఎందుకంటే ఇప్పుడే బాబు పొత్తుపై ఒక రాయి వేసినట్లు కనిపిస్తున్నారు. మరి జనసేన నేతల, కార్యకర్తలు ఏ ఆలోచనతో ఉన్నారు...వారు పొత్తు పెట్టుకోవడానికి రెడీగానే ఉన్నారా? అనే విషయాన్ని టెస్ట్ చేసినట్లు కనిపిస్తున్నారు.

అయితే జనసేన నేతలు తొందరపడి పొత్తులపై మాట్లాడారు. పవన్‌కు సీఎం సీటు ఇస్తేనే పొత్తు అన్నట్లు హింట్ ఇచ్చేశారు. దీంతో టీడీపీ శ్రేణులకు ఇంకా క్లారిటీ వచ్చింది. అందుకే పవన్ పొత్తులపై ఎవరిని తొందరపదొడ్డు..మైండ్ గేమ్‌లు పావులు కావొద్దని సూచించారు. అయితే పొత్తుపై పవన్ క్లారిటీగానే ఉన్నట్లున్నారు...పొత్తుకు రెడీ అన్నట్లే పరిస్తితి ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: