మొదట నుంచి కృష్ణా, గుంటూరు జిల్లాలు తెలుగుదేశం పార్టీకి కాస్త అనుకూలంగా ఉంటూ వచ్చేవి. ఏ ఎన్నికల్లోనైనా ఈ రెండు జిల్లా ల్లో మంచి ఫలితాలే వచ్చేవి. కానీ గత ఎన్నికల్లోనే సీన్ రివర్స్ అయింది. అయితే రెండు జిల్లాల్లో కీలకంగా ఉన్న విజయవాడ, గుంటూరు నగరా ల్లో మాత్రం టీడీపీ కాస్త సత్తా చాటింది. రెండు నగరాల పరిధిలో మొత్తం ఐదు సీట్లు ఉన్నాయి. ఇందులో రెండు సీట్లని టీడీపీ గెలుచుకుంది.

గుంటూరు వెస్ట్, విజయవాడ ఈస్ట్ సీట్లు టీడీపీ ఖాతాలో పడ్డాయి. ఇక విజయవాడ సెంట్రల్ సీటుని కేవలం 25 ఓట్ల తేడాతో కోల్పోవాల్సి వచ్చింది. అటు విజయవాడ వెస్ట్, గుంటూరు ఈస్ట్ సీట్లని కూడా కోల్పోయింది. ఈ మూడు సీట్లు వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. అయితే రెండు నగరాల్లో ఈ సారి సీన్ మారుతుంది. వైసీపీకి వ్యతిరేకంగా రాజకీయంగ్ మారుతుంది. ఈ రెండున్నర ఏళ్లలో రెండు చోట్ల టీడీపీకి అనుకూలమైన పరిస్తితి వచ్చింది.

పైగా అమరావతికి రెండు నగరాలు అటు, ఇటు ఉన్నాయి. దీంతో అమరావతి ప్రభావం కూడా బాగా ఉంది. ఇది టీడీపీకి కలిసొస్తుంది. ఇక ఈ సారి మాత్రం రెండు చోట్ల సైకిల్ సవారీ సాగేలా ఉంది. విజయవాడ ఈస్ట్‌లో ఎలాగో టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్ట్రాంగ్‌గా ఉన్నారు. అటు సెంట్రల్‌లో టీడీపీ నేత బోండా ఉమా పికప్ అయ్యారు. అలాగే విజయవాడ వెస్ట్‌లో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై తీవ్ర వ్యతిరేకత వస్తుంది.

ఇక గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరిపై కూడా ఎక్కువ వ్యతిరేకత ఉంది. టీడీపీని వదిలి వైసీపీ వైపుకు వెళ్ళిన ఈయనకు అంత పాజిటివ్ లేదు. ఈ సారి గుంటూరు ఈస్ట్‌లో వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫాకు ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. మొత్తానికి చూసుకుంటే ఈ సారి మాత్రం బెజవాడ-గుంటూరు నగరాల్లో సైకిల్ హవా నడిచేలా ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: