ఢీ : తెలంగాణ vs  ఆంద్ర ప్రదేశ్
అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయి ఏళ్లు గడుస్తున్నా కూడా  సమస్యలు పరిష్కారం కాకుండానే ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఇరు రాష్ట్రాల పాలకుల మధ్య సమన్వయం లేదు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించాక కొంతలో కొంత అనుకూల వాతావరణం ఏర్పడింది. ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి.. ఎందుకో తెలుసా ?
ఆంధ్ర ప్రదేశ్- తెలంగాణ రాష్ట్రాలమధ్య చాలా కాలంగా విభజన సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఈ సమస్యలపై గత ఏడాది చివర్లో కేంద్ర హోం మంత్రి అధ్యక్షతన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్ లసమావేశంలో చర్చ జరిగింది. అప్పడు పరిష్కారం కానీ కొన్ని సమస్యలపై ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ సిఎస్ లస్థాయిలో బుధవారం కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం వర్చువల్ గా జరిగింది. ఆవిభక్త ఆంధ్ర ప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయిన సందర్భంలో వచ్చిన ఆంధ్ర ప్రదేశ్ పునర్ విభజన చట్టం లోని షెడ్యల్ నంబర్ 9, 10 ల పైనే ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం.  ఢిల్లీలోని ఆంధ్ర ప్రదేశ్ భవన్ విభజన పై రెండు రాష్ట్రాలు పట్టుపట్టినట్లు తెలుస్తోంది. ఏపి జెన్ కోకు, తెలంగాణ రాష్ట్ర డిస్కంల నుంచి రావలసిన బకాయీలపై అంధ్ర ప్రదేశ్ అధికారులు మరోసారి కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకువెళ్లారు. బకాయిలు చెల్లిండంలో తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఏపి అధికారులు ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలిసింది. ఆరువేల కోట్ల రూపాయలకు పైగా తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ కు బకాయి ఉన్నదని, తాము ఎన్నిసార్లుప్రస్తావించినా, కేంద్ర హోం శాఖ మంత్రి దృష్టికి తీసుకు వెళ్లినా ఫలితం లేదని ఆంధ్ర ప్రదేశ్ అధికారులు కేంద్ర ప్రభుత్వాధికారులకు తెలిపారు. ఇవి కాక ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2014-15 సంవత్సరాలలో వనరులపై ఉన్న భిన్నాభిప్రాయాన్ని కూడా సమావేశం దృష్టికి తీసుకు వచ్చింది.  తెలంగాణ నుంచి సోమేష్ కుమార్ నేతృత్వంలోని అధికారులు,  ఆంధ్ర ప్రదేశ్  నుంచి సమీర్ శర్మ తోకూడిన అదికారులు, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వం లోని అధికారులు ఈ సమావేశంలో పాల్గోన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: