ఇపుడిదే అంశంపై  జనసేనలో చర్చ జరుగుతోంది. నేతలతో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతు పొత్తుల విషయంలో ఎవరు మైండ్ గేమ్ లో పడద్దని చెప్పిన విషయం తెలిసిందే. అవసరం వచ్చినపుడు అందరితోను చర్చించే నిర్ణయం తీసుకుంటామన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం బీజేపీతో పొత్తుల్లో ఉన్న విషయాన్ని పవన్ గుర్తుచేశారు. బీజేపీతో పొత్తు విషయాన్ని మాట్లాడుతు ‘ప్రస్తుతం పొత్తులో ఉన్నామ’ని అనటమే అందరినీ ఆశ్చర్యపోతున్నారు.




బీజేపీతో పొత్తు విషయం మాట్లాడుతు ప్రస్తుతం అనే పదం వాడారంటేనే భవిష్యత్తులో ఏమవుతుందో చెప్పలేమన్న అర్ధం వినబడుతోంది. రెండుపార్టీల మధ్య పొత్తున్నది నిజమే. అయితే ఏ కార్యక్రమాన్ని కూడా రెండుపార్టీలు కలిసి నిర్వహించింది లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండు పార్టీలు కూడా దేనికదే అన్నట్లుగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. రెండుపార్టీలు పొత్తు ధర్మాన్ని పాటించేదే నిజమైతే జాయింట్ గానే కార్యక్రమాలు నిర్వహించాలి.




రెండు పార్టీల మధ్య బాగా గ్యాప్ ఉందన్న విషయం అందరికీ తెలుసు. అలాగే బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతరేక నిర్ణయాలపై పవన్ ఏమీ మాట్లాడలేకపోతున్నారు. ఇదే సమయంలో బీజేపీ కూడా పవన్ను ఏమాత్రం లెక్క చేయటంలేదు. అందుకనే రెండుపార్టీల నేతలు ఒకళ్ళతో మరొకళ్ళు అంటీ ముట్టనట్లుగా ఉన్నారు. దీనికి తోడు మొన్నటి స్ధానికసంస్ధల ఎన్నికల్లో కొన్నిచోట్ల టీడీపీతో జనసేన సర్దుబాటు చేసుకుందే కానీ బీజేపీతో కలిసి పనిచేయలేదు.




ఇవన్నీ చూసిన తర్వాత రెండుపార్టీలు ఏదోరోజు విడిపోక తప్పదనే అందరికీ అనుమానాలున్నాయి. సరిగ్గా ఇలాంటి నేపధ్యంలోనే చంద్రబాబునాయుడు జనసేనానికి లవ్ ప్రపోజల్ పంపారు. అసలు ఓటు బ్యాంకేలేని, రాష్ట్రప్రయోజనాలను తుంగలో తొక్కేస్తున్న బీజేపీతో పవన్ ఎన్నికలదాకా కలిసుండే అవకాశం లేదని అర్ధమైపోతోంది. అంటే టీడీపీతో పొత్తుకు పవన్ మానసికంగా ఇతర నేతలను రెడీ చేస్తున్నారు. ఎందుకంటే నేతల్లో చాలామంది టీడీపీతో పొత్తుకు సిద్ధంగా లేరు. అందుకనే ఇప్పటి నుండే అందరినీ మానసికంగా ప్రిపేర్ చేస్తే భవిష్యత్తులో పొత్తులంటే ఇబ్బందులు లేకుండా ఉంటుందనేది ఆలోచన. చూద్దాం చివరకు ఏమవుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: