మొన్నీమధ్య టమోటాల ధరలు ఏకంగా 100 రూపాయలకు చేరిన సంగతి తెలిసిందే.. గతంలో లాక్ డౌన్ లో సమయంలో పెరిగిన రేట్లు ఇటీవల పలికాయి. అయితే ఇప్పుడు మాత్రం వీటి రేటు అమాంతం పడిపోయింది.ఇటీవల కాలంలో టమాట ధర వార్తల్లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఓ రోజు ఈ కూరగాయ ధర భారీగా పెరిగితే, మరోరోజు ఊహించని విధంగా తగ్గిపోయేది.. ముఖ్యంగా కర్నూల్ జిల్లాలో ధరలు రైతులను ఇబ్బంది పెడుతున్నాయి.


పత్తికొండ వ్యవసాయ మార్కెట్ లో ఈ సీన్ కనిపించింది. అయితే ఇది రేర్ గా కనిపించే సీన్ కాదు.. నిత్యం అక్కడ జరిగేదే. టమాట రేట్లు ఓ రోజు తక్కువ గాను, మరో రోజు ఎక్కువగా ఉండడంతో అక్కడి రైతుల బాధ వర్ణించేది కాదు. ఎందుకంటే ధర బాగా ఉన్నప్పుడు అమ్ముకోవడానికి అది నిల్వ ఉండేది కాదు. మొన్నటి వరకు కిలో టమాట 100 రూపాయలు పలికిన ధర.. ప్రస్తుతం మార్కెట్ లో ఓ రోజు 40 రూపాయలు, మరో రోజు 20 రూపాయలు పలుకుతుండటంతో రైతులకు, వ్యాపారుల మధ్య గత కొద్ది రోజులుగా చిన్నపాటి గొడవలు జరుగుతున్నాయని తెలుస్తుంది.


కిలో టమాట ధర 40 రూపాయలు నుండి 50 రూపాయలు ఉంటే తమకు గిట్టుబాటు ఉంటుందని రైతులు అంటున్నారు.ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో అధిక వర్షాలు రావడంతో టమాట పంట దెబ్బతినడంతో, గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక్కసారిగా కిలో టమాట 100 రూపాయలకు పైగా ధర పెరగడంతో వినియోగదారుల ఆందోళన చెందారు. ఓ రోజు టమాట రేట్లు పెరగడం మరో రోజు తగ్గడం మంచిది కాదని రైతులు అంటున్నారు.. ఇలా ధరలు పెరగడం, లేదా తగ్గడం ఉండకూడదు అంటే ఆ పరిసర ప్రాంతాలలో టమోటా జ్యుస్ లేదా సాస్ పరిశ్రమను  పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: