గుండు పిన్ను దగ్గర నుంచి తుపాకీ గుండు వరకు ఎప్పుడు అగ్రరాజ్యాల నుంచి కొనుగోలు చేసేది భారత్. కానీ ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. ఇతర దేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడం కాదు ఏకంగా  ఇతర దేశాలకు విక్రయించే స్థాయికి భారత్ ఎదిగింది. ఇన్ని రోజుల వరకు కేవలం అగ్రరాజ్యాలకు మాత్రమే సాధ్యమైన ఆయుధ వ్యాపారంలోకి  ఇప్పుడు భారత్  కూడా అడుగు పెట్టి దూసుకుపోతుంది. కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అటు భారత రక్షణ పరిశోధన సంస్థకు పూర్తిస్థాయి  సహకారం అందిస్తుంది. ఈ క్రమంలోనే ఒకప్పుడు సంవత్సరానికి ఒక్క క్షిపణి అభివృద్ధి చేస్తే గొప్ప అనుకునే స్థాయి నుంచి ప్రతి ఏడాది పదికి పైగా క్షిపణులను  అభివృద్ధి చేసి వాటికి  ప్రయోగాలు నిర్వహించి సక్సెస్ సాధించే స్థాయికి ఎదిగింది.



 ఇలా ఇప్పటి వరకూ భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ ఎన్నో అధునాతనమైన క్షిపణి వ్యవస్థలకు తయారుచేసి అగ్రరాజ్యాలకు వరుసగా షాప్ ఇస్తూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ తయారు చేసిన క్షిపణుల లో అటు బ్రహ్మోస్ మిస్సైల్     ఎంతో అద్భుతమైనది. దీనికి పరీక్షలు నిర్వహించగా ఎంతో కచ్చితత్వంతో లక్ష్యాలను ఈ మిస్సైల్ చేయిస్తుందని drdo శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే అయితే బ్రహ్మోస్ మిస్సైల్ ని అప్డేట్ చేస్తూ సూపర్ అడ్వాన్స్ బ్రహ్మోస్ మిస్సైల్ ను  ఇటీవల భారత రక్షణ పరిశోధన సంస్థల శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు అన్న విషయం తెలిసిందే.


 ఇటీవలే విశాఖపట్నం సముద్రం నుంచి ఈ ప్రయోగం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఎన్ ఎస్ విశాఖపట్నం యుద్ధనౌక నుంచి అడ్వాన్స్ బ్రహ్మోస్  ప్రయోగించారు. ఇక ఈ ప్రయోగం విజయవంతమైనట్లు భారత రక్షణ పరిశోధన సంస్థ తెలిపింది. ఈ మిస్సైల్   ఎంతో ఖచ్చితత్వంతో దూసుకెళ్లి లక్ష్యాన్ని ఛేదిందని శాస్తవ్రేత్తలు చెప్పుకొచ్చారు. ఇక అడ్వాన్స్ బ్రహ్మోస్ మిస్సైల్  ప్రయోగం సక్సెస్ కావడంతో అటు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా హర్షం వ్యక్తం చేశారు. రష్యా భారత్ సంయుక్త ప్రాజెక్టుగా ఈ అడ్వాన్స్ మిస్సైల్  తయారు చేశారు. అయితే శత్రుదేశాల రాడార్ వ్యవస్థ కు చిక్కకుండా ఎంతో కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందట. శబ్దం కంటే  మూడు రెట్లు వేగంతో ఈ మిస్సైల్  దాడి చేస్తుంది అన్న విషయాన్ని డిఆర్డిఓ శాస్త్రవేత్తలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: