నక్క జిత్తుల మారి చైనాకు ప్రస్తుతం అన్ని దేశాలు వరుసగా షాకుల ఇస్తున్నాయ్. ప్రపంచ దేశాలపై ఆధిపత్యం సాధించడమే లక్ష్యంగా చైనా ఎన్ని రోజుల పాటు అమలు చేసిన కుట్రలు అన్నింటి నుండి తేరుకుంటున్న దేశాలు ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు చైనాను ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి. ఆర్థిక సహాయం పేరుతో చిన్నచిన్న దేశాలకు అప్పులు ఇవ్వడం ఇక ఆ తర్వాత అప్పులు తీర్చలేని నేపథ్యంలో ఆయా దేశాలపై ఆధిపత్యాన్ని కొనసాగించి కొన్ని భాగాలను స్వాధీనం చేసుకోవడం లాంటివి చేసింది చైనా. ఈ క్రమంలోనే నేపాల్ బర్మా శ్రీలంక లాంటి భారత్ పొరుగుదేశాలపై ఇప్పటివరకు ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చింది.



ముఖ్యంగా శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఏర్పడటానికి ఒక రకంగా చైనా కారణం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆర్థిక సాయం పేరుతో చైనా శ్రీలంక కు ఎన్నో అప్పులు ఇచ్చింది. ఇక ఆ తర్వాత తమ దగ్గర్నుంచి అన్ని రకాల ఎరువులను కొనుగోలు చేయాలి అంటూ శ్రీలంకకు ఒక రూల్ పెట్టింది. దీంతో చేసేదేమీలేక శ్రీలంక చైనా నుంచి ఎన్నో ఎరువులను కొనుగోలు చేసింది. కానీ నాసిరకం ఎరువుల కారణంగా శ్రీలంకలో భారీగా నష్టం ఏర్పడింది. అయితే శ్రీలంక మొత్తం వ్యవసాయ రంగమే ప్రధాన ఆదాయం అన్న విషయం తెలిసిందే. దీంతో వ్యవసాయ రంగంలోనే పూర్తిగా నష్టం ఏర్పడడంతో చివరికి శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పరిస్థితి ఏర్పడింది.


 అయితే గత కొంత కాలం నుంచి మాత్రం చైనా పన్నుతున్న కుట్రలను నాసిరకం ఎరువులను గుర్తించిన శ్రీలంక వరుసగా తీసుకుంటున్న నిర్ణయాలు చైనా కు షాక్ ఇస్తూనే వస్తున్నాయి. దీంతో మరోసారి శ్రీలంక తీసుకున్న నిర్ణయం చైనా కు చంప మీద పెట్టి లా మారిపోయింది అన్నది అర్ధమవుతుంది. 96 వేల టన్నుల ఫెర్టిలైజర్ షిప్  చైనా నుంచి రాగా.. మాకు అవసరం లేదు అంటూ మళ్లీ వెనక్కు పంపించింది శ్రీలంక. ఇక అంతే మొత్తం ఎరువులను భారత్ నుంచి కొనుగోలు చేసి షాక్ ఇచ్చింది. అయితే ఇప్పుడు చైనాను కాదని భారత సూచనలను పాటించేందుకు సిద్ధమైంది శ్రీలంక. మరి ఇది ఎన్ని రోజుల వరకు కొనసాగుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: