ఏపీలో బలంగా ఉన్న వైసీపీ, టీడీపీల మధ్య జనసేనకు బలపడే అవకాశాలు పెద్దగా దొరకలేదనే చెప్పాలి. అక్కడకక్కడ ఏమన్నా అవకాశాలు దొరికిన సరే జనసేన పెద్దగా ఉపయోగించుకోలేదని చెప్పొచ్చు. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గానీ, ఆ పార్టీ నేతలు వచ్చిన అవకాశాలని వినియోగించుకోలేదు. టీడీపీ బలహీన పడినప్పుడు జనసేనకు బలపడే అవకాశాలు దొరికాయి..అయినా యూజ్ లేకుండా పోయింది.

ఇప్పుడు టీడీపీ పికప్ అయ్యే పరిస్తితి కనిపిస్తోంది. దీంతో జనసేనకు ఛాన్స్ లేకుండా పోయింది. అసలు రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకు పెద్దగా బలం లేదనే సంగతి తెలిసిందే. ఏదో నాలుగైదు జిల్లాల్లోనే కాస్త జనసేనకు బలం కనిపిస్తుంది గానీ...మిగిలిన జిల్లాల్లో జనసేన జీరో. ఇలాంటి పరిస్తితులు ఉన్నప్పుడు పవన్ గానీ, జనసేన నేతలుగానీ ఎక్కువ కష్టపడాలి. పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. కానీ అలాంటి పనులు ఏ మాత్రం చేయలేదు. దీంతో రాష్ట్రంలో జనసేనకు బలం లేకుండా పోయింది.

అయితే ఇప్పుడు పార్టీ బలోపేతంపై పవన్ దృష్టి పెట్టారు. ఇక ఇప్పుడు ఫోకస్ పెట్టడం వల్ల పెద్ద ప్రయోజనం లేదనే చెప్పొచ్చు. ఇప్పటికిప్పుడు పార్టీ సంస్థాగతంగా బలపడటం కష్టం. కాకపోతే గత ఎన్నికల్లో ఎక్కడైతే జనసేనకు కాస్త మంచిగా ఓట్లు పడ్డాయో...అలాంటి నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టి పనిచేస్తే బాగుంటుంది.

ఒకవేళ టీడీపీతో పొత్తు ఉంటే జనసేనకు ప్లస్సే...లేకపోయినా సత్తా చాటాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో కొన్ని నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టి పనిచేస్తే నెక్స్ట్ ఎన్నికల్లోపు కాస్త సెట్ అవ్వొచ్చు. అలా కృష్ణా-గుంటూరు జిల్లాల్లో జనసేన కొన్ని సీట్లపై ఫోకస్ చేస్తే అడ్వాంటేజ్ ఉంటుంది. కృష్ణాలో విజయవాడ వెస్ట్, కైకలూరు, అవనిగడ్డ లాంటి నియోజకవర్గాల్లో పార్టీని ఇంకా బలోపేతం చేస్తే ప్లస్ అవుతుంది. అటు గుంటూరులో..ప్రత్తిపాడు, తెనాలి, గుంటూరు వెస్ట్, ఈస్ట్ సీట్లపై దృష్టి పెట్టి పనిచేస్తే బెటర్. అలా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడే ఏదో బలపడాలంటే అయ్యే పని కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: