ఏపీలో రాజకీయ సమీకరణాలని టీడీపీ-జనసేన పార్టీల పొత్తు మార్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటే ఒకలా...పొత్తు లేకపోతే మరొకలా సమీకరణాలు మారిపోతాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే పొత్తు ఇప్పుడే తేలేలా లేదు...కాకపోతే పొత్తుకు చంద్రబాబు రెడీగానే ఉన్నారు. కానీ పవన్ ఇప్పుడు రెడీగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఇదే సమయంలో జనసేన నేతలు పొత్తు విషయంలో కాస్త నోరు జరుతున్నట్లు కనిపిస్తోంది. పవన్‌ని సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తే టీడీపీకి మద్ధతు ఇస్తామని మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ జనసేన బలం ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. పవన్‌కు సీఎం సీటు ఇచ్చేంత బలం జనసేనకు ఉందా? అంటే లేదని ఖచ్చితంగా చెప్పొచ్చు.

కాకపోతే టీడీపీకి తమ అవసరం ఉందని భావించి జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే పొత్తుపై ఇప్పుడే తొందరపడి మాట్లాడవద్దని పవన్, జనసేన నేతలకు సూచిస్తున్నారు. సమయం బట్టి పొత్తుల గురించి మాట్లాడదామని అంటున్నారు. అంటే పొత్తు వద్దు అనడం లేదు గానీ, తర్వాత మాట్లాడదాంలే అంటున్నారు. అంటే పవన్‌కు పొత్తుపై ఆసక్తి ఉందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ పొత్తు పెట్టుకుంటే ఎవరికి బెనిఫిట్, పెట్టుకోకపోతే ఎవరికి నష్టం అనేది చూస్తే...పొత్తు పెట్టుకుంటే రెండు పార్టీలకు లాభం ఉంది..పెట్టుకోకపోతే రెండు పార్టీలకు నష్టం ఉంది. అయితే ఇక్కడ పొత్తు పెట్టుకుంటే టీడీపీకి వచ్చే లాభం ఏంటంటే..కాపుల ప్రభావం ఉన్న నియోజకవర్గాల్లో జనసేన ఓట్లు టీడీపీకి కలిసి గెలిచే అవకాశాలు ఉన్నాయి.

అలాగే అసలు జనసేనకు ఏ మాత్రం బలం లేని నియోజకవర్గాల్లో టీడీపీ ఓట్లు కలిసి జనసేన గెలిచే అవకాశాలు ఉన్నాయి. జనసేన మద్ధతుతో టీడీపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే సమయంలో పొత్తుల వల్ల కొందరు టీడీపీ నేతలు నష్టపోతారు..సీట్లు కోల్పోతారు. జనసేనకు ఆ ఇబ్బంది లేదు. ఎందుకంటే జనసేనకు రాష్ట్రంలో పెద్ద బలం లేదు. మొత్తానికి చూసుకుంటే పొత్తు వల్ల జనసేనకు ప్లస్ ఎక్కువ ఉండగా, టీడీపీకి ప్లస్, మైనస్‌లు కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: