తాజా పరిస్దితులు చూస్తుంటే అదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. చాలా కాలం తర్వాత నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తన నియోజకవర్గంలో అడుగుపెడుతున్నారు. 2019లో వైసీపీ ఎంపీగా గెలిచిన రఘురామ తర్వాత జగన్మోహన్ రెడ్డితో చెడింది. దాంతో స్వపక్షంలోనే విపక్షమయ్యారు. ఎప్పుడైతే జగన్ తో విభేదించి తిరుగుబాటు జెండా ఎగరేశారో వెంటనే ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా భుజానికెత్తుకుంది. అప్పటి నుండి తిరుగుబాటు ఎంపీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ఏకంగా జగన్నే వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు.




దాని ఫలితంగా సీఐడీ కేసు నమోదు, తర్వాత అరెస్టు, విచారణలో జరిగిన సత్కారం, ఆ తర్వాత రాజుగారు ఢిల్లీ స్ధాయిలో చేసిన గోల అందరికీ తెలిసిందే. అప్పటినుండి రాష్ట్రంలోకి అడుగుపెట్టాలంటేనే రఘురామ భయపడుతున్నారు. ఒకసారి హైదరాబాద్ కు వచ్చినందుకే సీఐడీ అరెస్టు చేసింది. అలాంటిది ఇక ఏపీలోకి అడుగుపెడితే ఇంకేమన్నా ఉందా ? అన్నట్లుగా భయపడుతున్నారు. అయితే ఈమధ్యనే తిరుపతిలో అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగసభలో ఇలా ప్రత్యక్షమై ఆలా మాయమైపోయారు.




అలాంటిది ఈనెల 13వ తేదీన రాజుగారు తన సొంతూరు భీమవరంలోకి అడుగుపెడుతున్నారు. భీమవరంలోకి అడుగుపెట్టడమంటే పెద్ద సాహసం చేస్తున్నట్లే లెక్క. అదికూడా తొందరలోనే ఎంపీగా రాజీనామా చేయబోతున్నానని ప్రకటించిన తర్వాతే నియోజకవర్గంలోకి అడుగుపెడుతున్నారు. అడుగుపెట్టడం కూడా మామూలుగా అడుగుపెట్టడంలేదు. ఎలాగంటే ముగ్గురు వీడియో గ్రాఫర్లను వెంటపెట్టుకుని మరీ వస్తున్నారు. వీడీయో గ్రాఫర్లు ఎందుకంటే తనపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టే అవకాశం ఉందట. తనను ఎవరైనా కలిసినపుడు ఏమి మాట్లాడుకున్నామనే విషయాన్ని పూర్తిగా వీడియోలు తీయంచుకుంటారట. అయితే రాజుగారు ఊహించని విధంగా సీఐడీ మళ్ళీ విచారణకు రమ్మని చెప్పింది. హైదరాబాద్ లో ఇంటికెళ్ళి మరీ నోటీసులిచ్చారు.




ఒకవేళ ప్రభుత్వం తనపై ఏవైనా కేసులు పెడితే తన వీడియోలే సాక్ష్యాలుగా ఉంటాయని రాజుగారు చెబుతున్నారు. తాను ఎక్కడికైనా వెళ్ళినా, తనను ఎవరైనా కలిసినా వెంటనే వీడియోలు తీయించుకుంటారట. కానీ విచారణలో ఇది సాధ్యంకాదు. రాజుగారు తీసుకున్న జాగ్రత్తలతోనే  ఎంతలా భయపడిపోతున్నారో అర్ధమవుతోంది. రెండు రోజుల పర్యటనకు వస్తున్న రాజుగారు, పైగా వై క్యాటగిరి భద్రత ఉండి కూడా ఇంతలా భయపడుతున్నారంటే ఆశ్చర్యంగానే ఉంది. రెండు రోజుల పర్యటనకే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న రఘురామ రేపు రాజీనామా చేసిన తర్వాత వచ్చే ఉపఎన్నికల్లో ఇంకేమి ప్రచారంచేస్తారు ?


 

మరింత సమాచారం తెలుసుకోండి: