అధికార పార్టీలో ఉంటే ఏదొక పదవి రావడమో లేక రాజకీయంగా ఏదైనా బెనిఫిట్ జరగడం గానీ ఉంటాయి. అలాగే కావాల్సిన పనులు చేయించుకుంటారు. అందుకే ప్రతిపక్షంలో ఉండే నేతలు...అధికార పార్టీల్లోకి వెళ్ళేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా వైసీపీ నేతలు, ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉండటంతో టీడీపీ నేతలు జంపింగ్‌లు జరిగాయి. గత ఎన్నికల ఫలితాల తర్వాత చాలామంది టీడీపీ నేతలు వైసీపీ వైపుకు వచ్చారు.

అయితే ఇందులో కొంతమందికి వైసీపీలో పదవులు వచ్చాయి...కానీ కొంతమందికి ఎలాంటి పదవులు రాలేదు. పైగా వారు రాజకీయంగా అడ్రెస్ లేకుండా ఉన్నారు. గత ఎన్నికల తర్వాత విశాఖలో ఆడారి ఆనంద్ టీడీపీని వదిలి వైసీపీలోకి వచ్చారు. ఈయన అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక టీడీపీలోకి వచ్చాక ఈయన పోలిటికల్ స్క్రీన్‌పై కనిపించడం లేదు. అలాగే రాజకీయంగా ఎలాంటి పదవి కూడా వచ్చినట్లు లేదు. కాకపోతే బిజినెస్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు.

అటు కాకినాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన చలమలశెట్టి సునీల్ సైతం టీడీపీని వదిలి వైసీపీలో చేరారు. వైసీపీలో చేరాక ఈయన కనిపించడం లేదు. అలాగే ఈయనకు రాజ్యసభ పదవి ఇస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. కానీ ఇంతవరకు ఎలాంటి పదవి రాలేదు. అటు ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు సైతం టీడీపీని వీడి వైసీపీలో చేరారు. తన కుమారుడు సుధీర్‌తో కలిసి వైసీపీలోకి వచ్చారు. కానీ ఇంతవరకు ఈయనకు ఎలాంటి పదవి రాలేదు. భవిష్యత్‌లో ఏదైనా పదవి వస్తుందనే గ్యారెంటీ కూడా కనిపించడం లేదు.

అలాగే దర్శి సీటులో ఓడిపోయిన బాలయ్య ఫ్రెండ్ కదిరి బాబూరావు సైతం టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఈయన కూడా వైసీపీలో కనిపించడం లేదు. ఇక నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన బీదా మస్తాన్ రావు సైతం వైసీపీలో చేరారు. చేరాక ఈయనకు ఎలాంటి పదవి రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: