వైసీపీ సర్కారుకు ఎంపీ రఘురామ కృష్ణంరాజుకూ జగడం మరింత ముదురుతోంది. పండగ సమయం అని కూడా చూడకుండా.. తనకు విచారణకు రమ్మని ఏపీ సీఐడీ నోటీసులు ఇవ్వడంపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు మండిపడుతున్నారు. అయితే.. సీఐడీ నోటీసులపై స్పందించకుండా ఉంటే.. మళ్లీ అరెస్టు చేసి గతంలో చేసినట్టు ఎక్కడ ఒళ్లంతా గాయాలు చేస్తారో అన్న ఆందోళన కూడా లేకపోలేదు. అందుకే ఎంపీ రఘురామ కృష్ణంరాజు హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు.


ఈ మేరకు ఆయన తన అభిమానులకు ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో ఏముందంటే.. నా ప్రియమైన కార్యకర్తలు, అభిమానులారా.. ఇవాళ సి.ఐ.డి అధికారులు నాకు ఇచ్చిన నోటీసుల పై చర్చించేందుకు నేను ఢిల్లీ వచ్చా... రేపు ఎవరూ కూడా నా కోసం ఎయిర్‌పోర్టుకు రావొద్దు. అంతిమంగా న్యాయమే గెలుస్తోందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు తన సందేశంలో పేర్కొన్నారు.


ఇంకా ఏమన్నారంటే.. “ ఏపీ సీఐడీ జారీ చేసిన తాజా నోటీసులు మరియు మన రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కొత్త కేసుల దృష్ట్యా ముందుగా నిర్ణయించుకున్న ప్రణాళిక అమలు చేయలేకపోతున్నానని అభిమానులకు ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ముందుగా అనుకున్న ప్రకారం గురువారం భీమవరం రాలేనని  తెలిపారు. నా శ్రేయోభిలాషులు మరియు నా మంచి కోరుకునే వారందరికీ ఈ విషయం తెలియజేయాలనుకుంటున్నానని ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలిపారు.


ఏపీ సీఐడీ నోటీసులు, ఏపీ ప్రభుత్వం పెట్టిన కొత్త కేసుల గురించి సీనియర్ లాయర్లతో చర్చించేందుకు అర్జంటుగా ఢిల్లీకి వచ్చానని ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలిపారు.  కాబట్టి రేపు విజయవాడ  విమానాశ్రయానికి నా కోసం ఎవరూ రాకండని విజ్ఞప్తి చేశారు. అంతే కాదు..  ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ మనమందరం సంక్రాంతిని జరుపుకుందామని పిలుు ఇచ్చారు. అలాగే రామరాజ్యం కోసం పని చేద్దామంటూ తన ప్రకటనను ఎంపీ రఘురామ కృష్ణంరాజు ముగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR