ఆనందయ్యను ఎవరు టార్గెట్ చేశారు, ఎందుకు టార్గెట్ చేశారు..? అసలు ఆనందయ్యను టార్గెట్ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది. సెకండ్ వేవ్ సమయంలో హీరోగా ఉన్న ఆనందయ్య.. థర్డ్ వేవ్ వచ్చేనాటికి ఎందుకు విలన్ గా మారిపోయారు. ఆయన మందుపై ఈ గొడవంతా ఎందుకు..? అధికారులు, ఆయుష్ విభాగం, స్థానిక పంచాయతీ సభ్యులు.. అందరూ ఆనందయ్యను ఎందుకు టార్గెట్ చేశారు.

కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆనందయ్య మందు ఎంతగా ఫేమస్ అయిందో అందరికీ తెలుసు. ఆ సమయంలో స్థానిక ప్రజా ప్రతినిధులు సైతం ఆయనను బాగా హైలెట్ చేశారు. చాలామంది తమ ప్రాంతాలకు తీసుకెళ్లి మరీ మందు తయారు చేయించుకున్నారు. ఆయన వద్ద బల్క్ గా మందు తయారు చేయించుకుని వెళ్లారు. ఆ తర్వాత కోర్టు కేసుల వ్యవహారంతో ఏదో తేడా వచ్చేసింది. ఆనందయ్య వర్సెస్ ప్రభుత్వం అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. మొదట్లో ఎంకరేజ్ చేసిన వారంతా తర్వాత ఆనందయ్యను లైట్ తీసుకున్నారు.

ధర్డ్ వేవ్, ఒమిక్రాన్ అనడమే ఆయన చేసిన తప్పా..?
గతంలో కూడా ఆనందయ్య నేరుగా కరోనా పేరు చెప్పేవారు కాదు. రోగ నిరోధక శక్తిని పెంచే మందు అనే పేరుతోనే తన ఆయుర్వేద మందుని పంపిణీ చేశారు. కానీ థర్డ్ వేవే రాకముందే.. ఒమిక్రాన్ అప్పుడప్పుడే భారత్ లో ఎంటరవుతున్న సందర్భంలో ఆయన.. ఒమిక్రాన్ అనే పేరుతో ప్రచారం చేసుకున్నారు. దీంతో ఒమిక్రాన్ సంగతే పూర్తిగా తెలియకముందే దానికి మందేంటి అని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఆనందయ్య మాత్రం ఒమిక్రాన్ అయినా, కొత్త వేరియంట్ వచ్చినా తన మందు సరిపోతుందని అన్నారు. దీంతో ఆయుష్ విభాగం కూడా దీనిపై సీరియస్ గా దృష్టిపెట్టి నోటీసులిచ్చింది.

అటు జిల్లా కలెక్టర్ కూడా ఆనందయ్యకు నోటీసులివ్వడం, అంతకు ముందే స్థానిక పంచాయతీ ఆనందయ్య మందు పంపిణీకి వ్యతిరేకంగా తీర్మానం చేయడం కూడా జరిగాయి. దీంతో ఆనందయ్య కార్నర్ అయిపోయారు. తాజాగా ఆయుష్ నోటీసుతో మరోసారి ఆయన లైమ్ లైట్ లోకి వచ్చారు. మొత్తమ్మీద ఆనందయ్య అన్ని వైపులనుంచి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: