తెలంగాణ సీఎం కేసీఆర్ ను వ‌రుసబెట్టి బీజేపీ వ్య‌తిరేక జాతీయ నేత‌లు భేటీ అవుతుండ‌డంతో దేశరాజ‌కీయాలు తెలంగాణ వైపు చూస్తున్నాయి. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఆర్‌జేడీ నేత తేజ‌స్వీ యాద‌వ్ కేసీఆర్‌ను క‌లువ‌గా గ‌తంలో తోక‌పార్టీలు అని ఎద్దేవా చేసిన క‌మ్యూనిస్టు పార్టీలు అయిన సీపీఐ(ఎం), సీపీఐ అగ్రనేత‌లను ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో క‌లుసుకున్నారు గులాబీ బాస్‌. ఈ భేటీలు బీజేపీకి వ్య‌తిరేకంగా కూట‌మిని ఏర్పాటు చేయ‌డం కోస‌మేన‌న్న ఊహాగానాలు వ్య‌క్తం అవుతున్నాయి. మ‌రోవైపు బీజేపీ అగ్ర నాయ‌కులు తెలంగాణలో ప‌ర్య‌టిస్తున్న వేళ కేసీఆర్ ఎత్తుకు పై ఎత్తు వేస్తూ బీజేపీ వ్య‌తిరేక పార్టీల కూట‌మిని సిద్ధం చేయాల‌నే వ్యూహాలు ప‌న్నుతున్న‌ట్టు తెలుస్తోంది.


  అయితే, గ‌తంలో 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు దేశ రాజ‌కీయాల్లో కీల‌కంగా మారాల‌ని చూశారు. దీంట్లో భాగంగానే బీజేపీ, కాంగ్రెస్‌ల‌తో సంబంధం లేకుండా ప్రాంతీయ పార్టీల‌తో క‌లిసి థ‌ర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్ర‌య‌త్నాలు చేశారు. ఆ సంద‌ర్భంలో కేసీఆర్ స్వ‌యంగా బీజేపీ, కాంగ్రేసేత‌ర పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల ద‌గ్గ‌ర‌కు వెళ్లి క‌లిసి మూడో కూట‌మి గురించి చ‌ర్చించారు. అయితే, తాజాగా జాతీయ నేత‌లే సీఎం కేసీఆర్ ను క‌ల‌వ‌డం ప‌లు వాద‌నలు వ్య‌క్తం అవుతున్నాయి. వాళ్లు స్వ‌యంగా రాలేద‌ని బీజేపీకి భ‌య‌ప‌డి మాత్రం కేసీఆర్ ఆ నాయ‌కులు ఆహ్వానించాడ‌ని బీజేపీ నేత‌లు ఆరోపిస్తున్నారు.


  దీంతో పాటు తెలంగాణ‌పై బీజేపీ పెద్ద‌లు ప్ర‌త్యేక దృష్టి పెట్ట‌డంతో పాటు రానున్న రోజుల్లో రాష్ట్రంలో కాషాయ జెండా ఎగుర‌వేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ పై దృష్టి మ‌లిచి త‌మ వైపు తిప్పుకునేందుకు బీజేపీ ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది. దీంతో ఇరు పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి.  ఈ క్ర‌మంలో రాష్ట్రానికి బీజేపీ అగ్ర‌నేత‌ల‌తో పాటు ప‌లు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు రావ‌డంతో మీడియా, ప్ర‌జ‌ల చూపు అంతా బీజేపీనే ఉంది. ఈ నేప‌థ్యంలో త‌న వైపు దృష్టి తిప్పుకోవ‌డంతో పాటు జివో317 కు వ్య‌తిరేకంగా పోరాడుతున్న పోరాటాల‌ను మ‌రుగున ప‌డేసేందుకే కేసీఆర్ లీడ‌ర్ల‌తో స‌మావేశం అవుతున్నాడ‌నే వాద‌న కొన‌సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: