ఒకప్పుడు అగ్ర రాజ్యాలుగా కొనసాగుతున్న దేశాలు వెనుకబడిన దేశంగా ఉన్న భారత్ను చులకనగా చూసేవి. ఏ విషయంలో కూడా భారత్ కు అంతగా ప్రాధాన్యత ఇచ్చేవి కావు. కాని ప్రస్తుతం భారత్ ఎదుగుతున్న తీరు చూసి అగ్రరాజ్యాల ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక రానున్న రోజుల్లో భారత్ తో తమకు పోటీ తప్పదు అనే అనుకుంటున్నాయ్ అగ్రరాజ్యాలు. ఎందుకంటే ప్రస్తుతం భారత్ అన్ని రంగాల్లో కూడా సూపర్ సక్సెస్ అవుతు దూసుకుపోతోంది. ముఖ్యంగా కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత జిడిపి రేటు అంతకంతకూ పెరిగి పోతుంది అన్న విషయం తెలిసిందే.  కరోనా వైరస్ సంక్షోభం సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవు తున్నప్పటికీ ఎన్నో సవాళ్లను తట్టుకుంటూ భారత వృద్ధి రేటు సాధిస్తూ ఉండడం అగ్రరాజ్యాల ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.



 ఒకప్పటిలా ప్రతి విషయంలో ఇతర దేశాల మీద ఆధారపడకుండా.. సొంతంగా అన్ని వస్తువులు తయారు చేసుకునే విధంగా మేకిన్ ఇండియా నినాదంతో ముందుకు సాగుతోంది భారత్. ఇక ఇదే సమయంలో ఆటు సొంతంగా ఆయుధాలను తయారు చేసుకోవడం కూడా మొదలు పెట్టింది అనే విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తిలో కూడా అగ్రరాజ్యాలను వెనక్కి నెడుతూ అగ్ర స్థానం లోకి వెళ్లి దిశగా దూసుకుపోతుంది భారత్. ఈ క్రమంలోనే ఇటీవల అగ్రరాజ్యంగా కొనసాగుతున్న రష్యాను వెనక్కి నెట్టి పైచేయి సాధించింది భారత్



 ప్రపంచ దేశాలలో అత్యధిక విద్యుత్ ఉత్పత్తి చేపడుతున్న దేశాలలో మొన్నటి వరకు భారత్ 4వ స్థానంలో కొనసాగుతోంది. మూడవ స్థానంలో రష్యా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం భారత రాజ్యాంగా ఉన్న రష్యా ని వెనక్కినెట్టి మూడవ స్థానానికి ఎగబాకింది. దీన్ని బట్టి భారత్ అన్ని రంగాల్లో ఎలా వృద్ధి రేటు సాధిస్తుంది అన్నది అర్థం చేసుకోవచ్చు అని అంటున్నారు విశ్లేషకులు.  ఇదివరకు భారత్లో కేవలం బొగ్గు ఆధారిత విద్యుత్ మాత్రమే ఉత్పత్తి చేసే వారు. కానీ ఇప్పుడు ఎక్కువగా జల విద్యుత్ ఉత్పత్తి చేయడంతోపాటు సోలార్ పవర్, విండ్ పవర్ ద్వారా కూడా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న భారత్ క్రమంగా న్యూక్లియర్ పవర్ వైపుగా కూడా అడుగులు వేస్తూ ఉండటం గమనార్హం. ఒకవైపు దేశంలో 24 గంటల కరెంటు ఇస్తూనే ప్రపంచ దేశాలకు పోటీ ఇస్తుంది భారత్.

మరింత సమాచారం తెలుసుకోండి: