300 కోట్ల రూపాయ‌ల మేర‌కు చేతులు మారే పందాలు ఏపీలో పోలీసుల‌కు తెలియ‌కుండా జ‌రిగిపోతున్నాయి క‌నుక మా శ్రీ‌కాకుళం పందెం రాయుళ్ల‌ను ఏమీ అనొద్దు..అదేవిధంగా మిగతా ప్రాంతాల పందెం రాయుళ్ల‌నూ అరెస్టు చేయొద్దు. ఎందుకంటే పందెం ఆడ‌డం నేరం.. ఆడించ‌డం నేరం కానీ పోలీసు క‌నుస‌న్న‌ల్లోనో వారి ప్రోత్సాహంతో అడితే అది ఎటువంటి చ‌ట్ట విరుద్ధం కూడా కాదు..కాబోదు కూడా!

పోలీసులూ,రాజ‌కీయ నాయ‌కులూ క‌లిసి ఒకే వేదిక‌ను పంచుకుంటారు.ఆ విధంగా గోదావ‌రి జిల్లాలో మొద‌ల‌యిన ఈ సంస్కృతి ఇప్పుడు మారుమూల ప‌ల్లెల‌కూ పాకుతోంది.పందాలు అన్న‌వి చ‌ట్ట విరుద్ధం అయినా కూడా దీనిని ఎవ్వ‌రూ ప‌ట్టించుకోని స్థితిలో లేరు. ఈ నేప‌థ్యంలో పెద్ద పండుగ వేళ గ్రామాల‌లో త‌గువులూ తంటాలూ మొద‌ల‌యిపోతున్నాయి.పేకాట తాగుడు తో పాటు కోడి పందాలు విపరీతంగా జ‌రుగుతున్నాయి.ఎవ్వ‌రినీ నిలువ‌రించే శ‌క్తి లేన‌ప్పుడు జ‌రిగే ప‌రిణామాల‌ను చూస్తూ ఊరుకోవ‌డ‌మే ఉత్త‌మం క‌నుక ఈ సారి కోడి పందాలకు సంబంధించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మేలు.

కోడి పందాల‌ను ఆప‌డం ఏపీ స‌ర్కారు త‌రం కాదు. ఏ ప్ర‌భుత్వం ఉన్నా య‌థేచ్ఛ‌గా కోడి పందాలు ఆడడం, ఆడించడం అన్న‌వి
అస్స‌లు మార‌ని విష‌యాలు. రోజురోజుకీ పెరుగుతున్న ఆధునిక సంస్కృతి మాత్రం ఈ పాత కాలం అల‌వాటును మాత్రం మార్చ‌లేక‌పోతోంది.పందాల‌న్నీ కొబ్బ‌రి తోటల్లోనో, జీడి, మామిడి తోట‌ల్లోనో య‌థేచ్ఛ‌గా అడ్డూ అదుపూ లేకుండా జ‌రిగిపోతున్నాయి. కానీ పోలీసులు మాత్రం అస్స‌లు ప‌ట్టించుకోరు. వారికి అస్స‌లు వీటి గురించి తెలియ‌నే తెలియ‌దు.

క్రాంతికి కోడి పందాల జోరందుకుంది.ఎన్న‌డూ లేనంత‌గా మారుమూల ప‌ల్లెల్లో సైతం కోడి పందాలు సాగుతున్నాయి.ఒక‌ప్పుడు నోట్ల క‌ట్ట‌లు ఉంచి ఆడేవారు.ఇప్పుడంతా డిజిట‌ల్ పేమెంట్లే కావ‌డంతో ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే లాంటి యాప్ ల‌ను యూజ్ చేసి మ‌రీ ! ఆట ఆడేస్తున్నారు.తూర్పుగోదావ‌రి,పశ్చిమ గోదావ‌రి జిల్లాల‌కే కాదు ఇప్పుడీ సంస్కృతి శ్రీకాకుళం జిల్లా, ఇచ్ఛాపురం వ‌ర‌కూ వ‌చ్చేసింది.దీంతో సంత‌ల్లో పందెం కోళ్ల‌కు విప‌రీతం అయిన గిరాకీ ఉంది. ఒక్కో కోడి నాలుగు వంద‌ల నుంచి ఐదు వంద‌ల వ‌ర‌కూ ప‌లుకుతోంద‌ని తెలుస్తోంది.సంక్రాంతి స్పెష‌ల్ : ఎక్క‌డుంది ఎక్క‌డుంది నా కోడి!

300 కోట్ల రూపాయ‌ల మేర‌కు చేతులు మారే పందాలు ఏపీలో పోలీసుల‌కు తెలియ‌కుండా జ‌రిగిపోతున్నాయి క‌నుక మా శ్రీ‌కాకుళం పందెం రాయుళ్ల‌ను ఏమీ అనొద్దు..అదేవిధంగా మిగతా ప్రాంతాల పందెం రాయుళ్ల‌నూ అరెస్టు చేయొద్దు. ఎందుకంటే పందెం ఆడ‌డం నేరం.. ఆడించ‌డం నేరం కానీ పోలీసు క‌నుస‌న్న‌ల్లోనో వారి ప్రోత్సాహంతో అడితే అది ఎటువంటి చ‌ట్ట విరుద్ధం కూడా కాదు..కాబోదు కూడా!

పోలీసులూ,రాజ‌కీయ నాయ‌కులూ క‌లిసి ఒకే వేదిక‌ను పంచుకుంటారు. ఆ విధంగా గోదావ‌రి జిల్లాలో మొద‌ల‌యిన ఈ సంస్కృతి ఇప్పుడు మారుమూల ప‌ల్లెల‌కూ పాకుతోంది. పందాలు అన్న‌వి చ‌ట్ట విరుద్ధం అయినా కూడా దీనిని ఎవ్వ‌రూ ప‌ట్టించుకోని స్థితిలో లేరు. ఈ నేప‌థ్యంలో పెద్ద పండుగ వేళ గ్రామాల‌లో త‌గువులూ తంటాలూ మొద‌ల‌యిపోతున్నాయి. పేకాట తాగుడు తో పాటు కోడి పందాలు విపరీతంగా జ‌రుగుతున్నాయి. ఎవ్వ‌రినీ నిలువ‌రించే శ‌క్తి లేన‌ప్పుడు జ‌రిగే ప‌రిణామాల‌ను చూస్తూ ఊరుకోవ‌డ‌మే ఉత్త‌మం క‌నుక ఈ సారి కోడి పందాలకు సంబంధించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మేలు.

కోడి పందాల‌ను ఆప‌డం ఏపీ స‌ర్కారు త‌రం కాదు. ఏ ప్ర‌భుత్వం ఉన్నా య‌థేచ్ఛ‌గా కోడి పందాలు ఆడడం, ఆడించడం అన్న‌వి
అస్స‌లు మార‌ని విష‌యాలు. రోజురోజుకీ పెరుగుతున్న ఆధునిక సంస్కృతి మాత్రం ఈ పాత కాలం అల‌వాటును మాత్రం మార్చ‌లేక‌పోతోంది. పందాల‌న్నీ కొబ్బ‌రి తోటల్లోనో, జీడి, మామిడి తోట‌ల్లోనో య‌థేచ్ఛ‌గా అడ్డూ అదుపూ లేకుండా జ‌రిగిపోతున్నాయి. కానీ పోలీసులు మాత్రం అస్స‌లు ప‌ట్టించుకోరు. వారికి అస్స‌లు వీటి గురించి తెలియ‌నే తెలియ‌దు.

సంక్రాంతికి కోడి పందాల జోరందుకుంది.ఎన్న‌డూ లేనంత‌గా మారుమూల ప‌ల్లెల్లో సైతం కోడి పందాలు సాగుతున్నాయి. ఒక‌ప్పుడు నోట్ల క‌ట్ట‌లు ఉంచి ఆడేవారు.ఇప్పుడంతా డిజిట‌ల్ పేమెంట్లే కావ‌డంతో ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే లాంటి యాప్ ల‌ను యూజ్ చేసి మ‌రీ ! ఆట ఆడేస్తున్నారు. తూర్పుగోదావ‌రి,పశ్చిమ గోదావ‌రి జిల్లాల‌కే కాదు ఇప్పుడీ సంస్కృతి శ్రీకాకుళం జిల్లా, ఇచ్ఛాపురం వ‌ర‌కూ వ‌చ్చేసింది.దీంతో సంత‌ల్లో పందెం కోళ్ల‌కు విప‌రీతం అయిన గిరాకీ ఉంది. ఒక్కో కోడి నాలుగు వంద‌ల నుంచి ఐదు వంద‌ల వ‌ర‌కూ ప‌లుకుతోంద‌ని తెలుస్తోంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: