వైసీపీ మంత్రులు ఏం చెప్పినా
అవ‌న్నీ వినండి వాటిలో నిజానిజాలు
దేవుడికే ఎరుక !
నిజం ఉంటే కాలం నిరూపిస్తుంది
అబ‌ద్ధం ఉంటే ఈవీఎం నిరూపిస్తుంది

ఏదేమ‌యిన‌ప్ప‌టికీ
ఆ కేసులు మ‌రో వందేళ్ల‌యినా తేల‌వు
క‌నుక జ‌గ‌న్ కూ వారి మ‌నుషుల‌కూ
ఇప్ప‌ట్లో ఇబ్బందుల‌యితే లేవు రావు కూడా!

జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసుల‌కు సంబంధించి ప‌దేళ్లుగా వింటున్న మాట‌లే ఇప్పుడూ విన‌ప‌డుతున్నాయి.అంటే ఆయ‌న సంస్థ‌ల్లో పెట్టుబడులు పెట్టిన వారంతా స‌జావుగానే స‌క్ర‌మంగానే పెట్టార‌ని,ఇందులో ఎటువంటి త‌ప్పిదాలు లేవ‌ని అంటున్నారు వైసీపీ వ‌ర్గీయులు.అంటే ఆరోజు జ‌రిగిందంతా చ‌ట్ట‌బ‌ద్ధ‌మే అయితే కేసుల నుంచి క్లీన్ చిట్ ఈ పాటికే పొందాలి క‌దా అని టీడీపీ ప్ర‌శ్నిస్తే మాత్రం వైసీపీకి కోపాలు వ‌స్తున్నాయి.ఏదేమ‌యిన‌ప్ప‌టికీ పెట్టుబ‌డుల‌కు సంబంధించి జ‌గ‌న్ మ‌నుషులు కోర్టుల చుట్టూ తిరుగుతున్న మాట అయితే వాస్త‌వం.ఇవ‌న్నీ నిబంధ‌న‌ల‌కు తిలోద‌కాలిచ్చి చేసిన‌వే అని పేర్కొంటూ సీబీఐ,ఈడీ త‌దిత‌ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌న్నీ కోర్టుల‌కు నివేదించిన సంగ‌తి వాస్త‌వం.కానీ వీటిని అంగీకరించ‌కుండా తాజాగా త‌మ‌కొక ఐటీ క్లియ‌రెన్సు వ‌చ్చింద‌ని వైసీపీ చెప్ప‌డం,వాటినే ఆధారంగా చేసుకుని మంత్రి క‌న్నబాబు లాంటి వారు మీడియా ముఖంగా ఆనందం వ్య‌క్తం చేయ‌డం ఇంకా మంచి ప‌రిణామాలకే సంకేతం.


చాలా రోజుల త‌రువాత సాక్షి ఆఫీసుకు మ‌రియు జ‌గ‌తి ప‌బ్లికేష‌న్స్ కు ఇంకా ఇత‌ర జ‌గ‌న్ కంపెనీల‌కు ఓ మంచి వార్త అందింద‌ని తెలుస్తోంది. జ‌గ‌న్ సంస్థ‌ల్లో పెట్టిన పెట్టుబ‌డులకు సంబంధించి ఐటీ శాఖ ఓ క్లియ‌రెన్స్ ఇచ్చింద‌ని కూడా ఓ ప్రాథ‌మిక స‌మాచారం. దీనిపై ఎటువంటి స్ప‌ష్ట‌తా లేదు.కానీ కుర‌సాల క‌న్నబాబు (వ్య‌వ‌సాయ శాఖ మంత్రి) మాత్రం పండుగ చేసుకుంటున్నార‌ని టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి.ఆ రోజు జ‌గ‌న్ సంస్థ‌ల్లో పెట్టుబ‌డుల గురించి నానా మాట‌లూ అన్న మంత్రి ఇప్పుడు మాట మార్చేశార‌ని కూడా అంటున్నాయి.అంటే ఒక్క సారి మంత్రి ప‌ద‌వి రావ‌డంతో మాట‌ల‌న్నీ తారుమారు అవుతాయ‌ని నిరూపించిన మాజీ జర్న‌లిస్టు ఆయ‌నేన‌ని కూడా అంటున్నాయి. అంటే ఇప్పుడు అక్ర‌మాస్తుల కేసు అబ‌ద్ధం మంత్రి మాట నిజం..లేదా మంత్రి మాట అబ‌ద్ధం కేసులు నిజం అని అనుకోండి ఏం కాదు.


మరింత సమాచారం తెలుసుకోండి: