రాజీనామాకు రెడీ అవుతున్న రఘురామకృష్ణంరాజు...పరోక్షంగా తన ప్రత్యర్ధి ఎవరో కూడా హింట్ ఇచ్చారు. తాను వైసీపీ అరాచకాలపై పోరాడుతున్నానని, అసలు తన అసలైన ప్రత్యర్ధి మాత్రం జగన్ మోహన్ రెడ్డి అని చెబుతున్నారు. ఇంకా నరసాపురం బరిలో ఎవరు నిలబడిన తన ప్రత్యర్ధి మాత్రం జగనే అంటున్నారు. ఇదే సమయంలో పరోక్షంగా నరసాపురంలో ఏ పిల్ల కాకి నిలబడిన తనదే గెలుపు అని చెప్పి తాజాగా ఓ న్యూస్ చానల్ డిబేట్‌లో అన్నారు.

దీంతో రఘురామ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనే దానిపై విశ్లేషణలు మొదలైపోయాయి. అసలు నరసాపురం ఉపఎన్నిక వస్తే వైసీపీ తరుపున ఎవరిని నిలబెడతారనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో అంటే వైసీపీ తరుపున రఘురామ నిలబడగా, టీడీపీ తరుపున వేటుకూరి శివరామరాజు, జనసేన తరుపున నాగబాబు పోటీ చేశారు. అయితే హోరాహోరీ పోరులో టీడీపీ అభ్యర్ధిపై రఘురామ 30 వేల మెజారిటీతో గెలిచారు.

ఇక వైసీపీలో గెలిచిన దగ్గర నుంచి రఘురామ ఏ విధంగా వైసీపీపై పోరాడుతున్నారో చెప్పాల్సిన పని లేదు. జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇలా తమ పార్టీ నుంచి తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న రఘురామకు చెక్ పెట్టడానికి వైసీపీ కూడా గట్టిగానే ట్రై చేసింది...అనర్హత వేటు వేయించడానికి కూడా బాగానే ట్రై చేసింది. కానీ అది కుదరలేదు. దీంతో రఘురామనే రాజీనామాకు సిద్ధమయ్యారు.

ఫిబ్రవరి 5లోపు తనపై అనర్హత వేటు వేయించుకోండి అని సవాల్ చేశారు. లేదంటే తర్వాత తానే రాజీనామా చేసేస్తానని చెప్పారు. ఇదే క్రమంలో నరసాపురం ఉపఎన్నిక వస్తే ఎవరు వైసీపీ నుంచి నిలబడిన గెలుస్తానని రఘురామ ధీమాగా ఉన్నారు. అయితే రఘురామ మాటలు బట్టి చూస్తే వైసీపీ నుంచి గోకరాజు గంగరాజు తనయుడు రంగరాజు నిలబడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఎవరు బరిలో ఉన్న తన ప్రత్యర్ధి మాత్రం జగనే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: