తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి దాటాక 12గంటల 5నిమిషాలకు శ్రీవారి వైకుంఠ ద్వారాన్ని తెరిచారు. ధనుర్మాస పూజల తర్వాత ఒంటి గంట 45నిమిషాల నుంచి స్వామి వారి దర్శనం ప్రారంభమైంది. దీంతో సుప్రీం కోర్టు సీజేఐ ఎన్వీ రమణ శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రముఖుల దర్శనం తర్వాత సాధారణ భక్తులను అనుమతిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా క్యూలైన్లలో వేచి ఉన్నారు.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు భక్తులు పోటెత్తారు. వీఐపీలు, సాధారణ భక్తుల కోసం ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. దీంతో సుప్రీం కోర్టు జస్టిస్ యూయూ లలిత్, ఏపీ హైకోర్టు సీజే పీకే మిశ్రా, ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్, గౌతమ్ రెడ్డి, జయరామ్, వెల్లంపల్లి శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్, అనిల్ యాదవ్, ఆదిమూలపు సురేష్ తదితరులు వీఐపీ క్యూలైన్లో వెళ్లి ఉత్తర ద్వారం నుంచి వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. ఎంపీలు ప్రభాకర్ రెడ్డి, భరత్, ఎ్మమెల్యేలు రోజా, శిల్పా చక్రపాణి, ఎంపీ సీఎం రమేశ్ స్వామిని దర్శించుకున్నారు.

అంతేకాదు త్రిపుర హైకోర్టు చీఫ్ జస్టిస్ అమర్ నాథ్ గౌడ్, ఆంధ్రప్రదేశఅ హైకోర్టు జడ్జీలు ఈశ్వరయ్య, కృష్ణమోహన్, దుర్గాప్రసాద్, రమేశ్ ఆ వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. ఇక వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమలలో వైభవంగా స్వర్ణ రథోత్సవం జరిగింది. స్వర్ణ రథంపై స్వామివారు తిరుమాఢ వీధుల్లో విహరిస్తూ, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు పాల్గొన్నారు.

మరోవైపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామి దేవస్థానం కిటకిటలాడింది. బాలాలయంలో లక్ష్మీ నరసింహుడు భక్తులకు వైకుంఠ ద్వారం నుంచి దర్శనమిచ్చారు. లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్ ద్వారా అధికారులు అనుమతించారు. కోవిడ్ నిబంధనలు పాటంచాలని.. మాస్క్ ధరిస్తేనే ఆలయంలోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: