రాష్ట్రంలో సంక్రాంతి త‌రువాత రోడ్లు బాగుప‌డ‌తాయి అన్న ఆశ‌లేదు.. ఆ విధంగా ప‌నులు జోరందుకుంటాయి అని అనుకోవ‌డానికీ లేదు. ఎప్పుడు రోడ్లు  బాగుచేద్దామ‌న్నా వ‌ర్షాలు అడ్డంకిగా ఉంటున్నాయ‌న్న వాద‌న‌ను వైసీపీ వినిపిస్తోంది. దీంతో ప్ర‌మాదాల నివార‌ణ అన్న‌ది ఎక్క‌డికక్క‌డ సాధ్యం కావ‌డం లేదు. ఈ ద‌శ‌లో విప‌క్ష పార్టీ స‌భ్యులే ప్ర‌భుత్వ తీరును ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లేందుకు విభిన్న తీరులో నిర‌స‌న‌కు సిద్ధం అవుతూ ప్ర‌జ‌ల‌ను చైత‌న్య ప‌రిచేందుకు స‌మాయ‌త్తం అవుతున్నారు.


రోడ్లు బాగుండ‌క పోవ‌డంతో త‌రుచూ ప్ర‌మాదాలు జ‌రుగుతున్నందున టీడీపీనే  ప్ర‌త్య‌క్ష కార్యాచ‌ర‌ణ‌కు దిగి మ‌ర‌మ్మ‌తుల‌కు నిధులు కేటాయించే వ‌ర‌కూ శ్ర‌మదానంతోనే ప్ర‌భుత్వంకు జ‌వాబు చెప్పాల‌ని భావిస్తోంది. దీంతో ఎక్క‌డిక్క‌డ ప‌నులు చేప‌ట్టేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందించుకుంటోంది. నిధుల లేమిని సాకుగా చూపి రాష్ట్రంలో చాలా చోట్ల ర‌హ‌దారుల ప‌నులు ఆపి వేయ‌డం త‌గ‌ద‌ని, క‌నీసం మ‌ర‌మ్మ‌తుల‌కు కూడా చొర‌వ చూప‌క‌పోవ‌డం స‌మంజ‌సం కాద‌ని ప‌సుపు పార్టీ వ‌ర్గాలు గ‌గ్గోలు పెడుతున్నాయి. ఈ దశ‌లో ర‌హ‌దారుల మ‌రమ్మ‌తుల‌కు కొన్ని చోట్ల తెలుగు యువ‌తే చొర‌వ చూప‌డంతో ముందున్ను కాలంలోనూ ఇదే విధంగా చేస్తామ‌ని చెప్ప‌డంతో ప్ర‌జ‌లు కూడా ఈ త‌రహా వినూత్న నిర‌స‌న‌ను స్వాగ‌తిస్తున్నారు.


"గుంత‌ల రోడ్లు ప్ర‌యాణికుల పాట్లు
మేల్కొందాం ప్ర‌భుత్వాన్ని త‌రిమికొడ‌దాం"
- ఇదే నినాదంతో టీడీపీ ప‌నిచేస్తుంది


జాతీయ యువజ‌న దినోత్స‌వం సంద‌ర్భంగా విజ‌య‌న‌గ‌రం జిల్లా తెలుగు యువ‌త వినూత్న నిర‌స‌న‌ల‌కు పిలుపునిచ్చింది. రోడ్లు బాగోక ప్ర‌యాణికులు నానా అవ‌స్థ‌లు ప‌డుతున్న నేప‌థ్యంలో వాటి మ‌రమ్మ‌తుల‌కు ప్రాధాన్యం ఇచ్చింది.నిన్న‌టి వేళ విజ‌య‌న‌గ‌రం,
గ‌జ‌ప‌తి న‌గ‌రం,నెల్లిమ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గాల్లో తెలుగు యువత శ్ర‌మ‌దానం చేసి రోడ్ల పై గొయ్యిలు సిమెంట్ తో  క‌ప్పారు. చాలా చోట్ల రోడ్లు  అస్త‌వ్య‌స్తంగా ఉన్న కార‌ణంగా త‌రుచూ ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి.వీటిని నివారించేందుకు వీలున్నంత వర‌కూ రోడ్ల మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టాలని వైసీపీ ప్ర‌భుత్వాన్ని వేడుకున్నా కూడా ఫ‌లితం ఉండ‌డం లేద‌ని టీడీపీ వాపోతోంది.ఈ త‌రుణంలో చేసేదేం లేక ప్ర‌త్యామ్నాయ మార్గంగా దారుల‌ను కాస్తో కూస్తో బాగు చేసే ప‌నికి తాము పూనుకున్నామ‌ని టీడీపీ అంటోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: